దావూద్ పని ముగించేస్తాం.. రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్
అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం ను పట్టుకునేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అతనికి సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా కేంద్రం ఇప్పటికే రాబట్టింది. దీనిలో భాగంగానే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను ఏ క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని.. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా దావూద్ ఇబ్రహీంను మట్టుబెడతామని ఆయన పేర్కొన్నారు. ‘‘సామ, దాన, భేద, దండోపాయాల సంగతి తెలుసు కదా... ఇప్పటికే దావూద్ పై వీటిలో కొన్నింటిని ప్రయోగించామని తెలిపారు. పాకిస్థాన్ లో దావుద్ స్వేచ్చగా తిరుగుతున్నప్పటికీ అతడి ప్రతి కదలికపై మాకు పూర్తి సమాచారం ఉందని... ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. ఎప్పుడో అప్పుడు దావూద్ పని ముగించేస్తాం'' అని రాథోడ్ సంచలనం వ్యాఖ్యానించారు.