Freedom of Speech Online

సెక్షన్ 66ఏ కొట్టివేత

  మంగళవారం సుప్రీంకోర్టు ఐటీ చట్టం-2000 సెక్షన్ 66 ఏను కొట్టిపారేస్తూ ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, పోస్టులు చేస్తే ఆ వ్యక్తులకు పోలీసులకు అరెస్ట్ చేసే అధికారంతో పాటు జైలు శిక్ష కూడా అధికారం ఉంటుంది. 2012లో షహీన్ ధర అనే యువతి ముంబయిలో శివసేన అధినేత బాల్ ఠాక్రే చనిపోయునప్పుడు బంద్ పాటించడాన్ని ఫేస్‌బుక్‌లో ప్రశ్నించగా రేణు శ్రీనివాసన్ అన్ యువతి ఆ పోస్టుకు లైక్ కొట్టండంతో ఇద్దరు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేయడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సహా, లా విద్యార్థిని శ్రేయా సింఘాల్ తో పాటు మరి కొన్ని ప్రయివేటు సంస్థలు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లేననీ, ఐటీ చట్టంలోని ఆ సెక్షన్‌ను తొలగిం చాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేసిన విషయం తెలిసిందే.

brahmini son nara nandamuri

బ్రహ్మణి ముద్దుల కొడుకు ఫొటో

  నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ తాతలు అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణి దంపతుల దాంపత్యం ఫలించి వారికి ఉగాదినాడు పండండి మగశిశువు జన్మించారు. ఆరోజు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో బ్రహ్మణి తమ కలల పంటకు జన్మనిచ్చారు. ఈ వార్త అటు నారా, ఇటు నందమూరి కుటుంబాలలో మాత్రమే కాకుండా నందమూరి, నారా వారి అభిమానులలో కూడా ఆనందోత్సాహాలు నింపింది. వారిలో ఉత్సాహం పెరిగిపోయి, కొత్తగా పుట్టిన శిశువు సినిమా రంగంలో బాలకృష్ణ వారసుడని కొంతమంది అంటే, రాజకీయ రంగంలో చంద్రబాబు వారసుడని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు తెలివైనవారయితే బాలకృష్ణలాగా సినిమా రంగంలో ఇరగదీసిన తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి చంద్రబాబులా చక్రం తిప్పుతాడని అంటున్నారు. ఈ బుజ్జోడికి, ఎన్టీఆర్‌కి పోలిక తెస్తున్నారు. ఇదిలా వుంటే, నారావారి వారసుడి మొదటి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నారా బ్రాహ్మణి మంగళవారం ఉదయం తన ఫేస్ బుక్లో కొడుకు ఫోటో పోస్ట్ చేశారు. ఈ బుజ్జిగాడి ఫోటోను షేర్ చేసుకోవటంతో పాటు లైక్లు కొడుతున్నారు.

new zealand caption 22 bals 50 runs

22 బాల్స్... 50 రన్స్

  దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ మొదటి సెమీ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 43 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగించి మ్యాచ్‌ని 43 ఓవర్లకు పరిమితం చేశారు. ఈ 43 ఓవర్లలో న్యూజిలాండ్ 298 పరుగులు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. న్యూజిలాండ్ తన ఇన్నింగ్స్‌ని చాలా దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ మెక్కల్లమ్ కేవలం 22 బంతుల్లో 50 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే, ఇదే దూకుడుతో ఆడబోయి 59 పరుగులు చేసి ఔటైపోయాడు.

ap assembly

విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు ప్రకటన

ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచడం మీద  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు ఏపీఈఆర్సీ ప్రతిపాదన చేసిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యుత్ బోర్డును లాభాల్లోకి తెచ్చామని, విద్యుత్ లోటు కూడా తగ్గించామని వివరించారు. విద్యుత్ ఉత్పత్తి బాగా పెంచామని, వ్యవసాయ రంగానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటన ముఖ్యాంశాలు: * ఆంధ్రప్రదేశ్‌లోనే విద్యుత్ ఛార్జీలు తక్కువ * ఎఫ్సీఏ ఒక్క పైసా కూడా ఉండదు * వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఛార్జీలు పెంచడం లేదు * 200లోపు యూనిట్లు వాడితే విద్యుత్ ఛార్జీలు పెరగవు * 86 శాతం మందికి ఒక్క పైసా కూడా ఛార్జీలు పెరగవు * 14 శాతం మందికే విద్యుత్ చార్జీలు పెరుగుతాయి * పేదవాళ్లపై విద్యుత్ భారం వేయం * ఏపీ ఈఆర్సీ 22.5 శాతం  ఛార్జీలు పెంచాలని ప్రతిపాదిస్తే తిరస్కరించాను. * బడ్జెట్లో రూ.3,186 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. * నాణ్యత కోసమే విద్యుత్ సంస్కరణలు * అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్ల వల్లనే సమస్యలు * రెగ్యులేటరీ కమిషన్ను బలోపేతం చేశాం

Andhra Pradesh

పట్టిసీమపై అధికార ప్రతిపక్షాల పంతం దేనికి?

  ఒకవైపు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ శాసనసభ్యులు కీలకమయిన బడ్జెట్ సమావేశాలు బహిష్కరించి మరీ పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ బస్సు యాత్రలు చెప్పట్టేందుకు సన్నధం అవుతుంటే, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే పట్టిసీమ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టేందుకు సన్నధం అవుతోంది. అధికార పార్టీ ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటే, ప్రతిపక్ష పార్టీ అది ఎందుకూ పనికిరాని ప్రాజెక్టని ప్రజలకు హితభోద చేసేందుకు కంకణం కట్టుకొంది.   ఈవిధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే అంశంపై పూర్తి విభిన్నమయిన వాదనలు వినిపిస్తుండటంతో ఈవిషయంలో చాలా అయోమయం ఏర్పడింది. కనుక మీడియా స్వయంగా చొరవ తీసుకొని రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా సంబంధిత రంగానికి చెందిన ఇంజనీర్లు, నిపుణులు, మేధావులను రప్పించి వారి చేత ఈ ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరిస్తే బాగుంటుంది.  ఈ ప్రాజెక్టు గురించి వైకాపా ఇప్పటికే తన వాదనలను తన మీడియా ద్వారా ప్రజలకు వినిపిస్తోంది కనుక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మీడియా ద్వారానే ఈ ప్రాజెక్టు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే అపోహలకు తావు ఉండదు. 

Telangana

తెలంగాణా హైకోర్టు ఏర్పాటుకి హైకోర్టు బ్రేక్

  ఇక నేడో రేపో తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో స్వయంగా హైకోర్టు ధర్మాసనమే దానిని వ్యతిరేకించడం విశేషం. కల్యాణ్‌ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌ కుమార్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై వేయబడిన ఒక పిటిషన్ పై స్పందిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే హైకోర్టు ఏర్పాటు చేయవలసి ఉంటుంది తప్ప తెలంగాణా రాష్ట్రానికి కాదని స్పష్టంగా పేర్కొంది.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసుకొంటే ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణా రాష్ట్రానికే చెందుతుంది గనుక ఇప్పుడు వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని, ఆవిధంగా చేయడం విభజన బిల్లుకి వ్యతిరేకమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. విభజన బిల్లులో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు ఏర్పాటు చేసుకొనేవరకు ప్రస్తుత హైకోర్టే ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు గా కొనసాగుతుందని స్పష్టంగా పేర్కొనబడిందని, అందుకు నిర్దిష్ట కాల పరిమితి కూడా పేర్కొనబడలేదు కనుక తెలంగాణా రాష్ట్రానికి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.   కేంద్రన్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలంగాణకు వేరేగా హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని కూడా కోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. ఒకవేళ ఆవిధంగా చేయడలచుకొంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 31ని సవరించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు విభజన విషయంపై ఇరు రాష్ట్రాలు కౌంటర్ ఫైల్ చేయాలని కోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణాకి హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు ఆందోళనలు చేయరాదని, ఎవరయినా తమ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

Isuzu

శ్రీసిటీలో ట్రక్కుల తయారీ కర్మాగారం ఏర్పాటుకి ఇసుజు సిద్దం

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, వివిధ ప్రాజెక్టులపై పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రెండు నెలల క్రితం జపాన్ పర్యటించారు. తత్ఫలితంగా ఇప్పుడు జపాన్ కి చెందిన ఇసుజు ట్రక్కుల తయారీ సంస్థ చిత్తూరులో శ్రీ సిటీ వద్ద తమకు అన్ని సదుపాయాలూ కల్పిస్తే రూ. 1,500 కోట్ల భారీ పెట్టుబడితో ట్రక్కుల తయారీ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తకాసి తెలియజేసారు. తమ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తే సరిగ్గా వచ్చే ఏడాది ఇదే సమయానికి తమ కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దంగా ఉందని తకాసి తెలిపారు. అందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.   శ్రీ సిటీ వద్దనే ప్రముఖ హీరో మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ త్వరలో నిర్మాణ కార్యక్రామాలు ఆరంభించబోతోంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం 543 ఎకరాలను కేటాయించింది. ఇటువంటి భారీ సంస్థ రాష్ట్రానికి వచ్చినట్లయితే, దానితో బాటు వందలాది అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. వాటిద్వారా కూడా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.

shashi kapoor

శశికపూర్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

  ప్రముఖ బాలీవుడ్ నటుడు శశి కపూర్‌కి కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. భారతీయ చలనచిత్ర రంగంలో నటుడిగా, నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శశి కపూర్ మార్చి 18, 1938న కలకత్తాలో జన్మించాడు. ఈయన పృథ్విరాజ్ కపూర్ తనయుడు, రాజ్‌కపూర్ సోదరుడు. శశి కపూర్ కొన్ని సినిమాలకు దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కూడా పని చేశాడు. 2011లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రధానం చేసింది. ఇప్పుడు ఆయన్ని దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. శశి కపూర్ నాలుగు సంవత్సరాల వయసునుండే తండ్రి పృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన పృథ్వీ థియేటర్స్ ‌లో ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన నాటకాలలో నటించడం ప్రారంభించారు.1940 దశాబ్దిలోనే సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి కమర్షియల్ చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. అప్పట్లో శశికపూర్ పేరుతో పౌరాణిక చిత్రాల్లో నటించే మరో బాలనటుడు ఉండటంతో శశిరాజ్ అనే పేరుతో చిత్రరంగానికి పరిచయం అయ్యాడు. 1948లో వచ్చిన ఆగ్, 1951లో వచ్చిన ఆవారా సినిమాల్లో తన అన్న రాజ్ కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 1950లో వచ్చిన సంగ్రామ్ చిత్రంలో అశోక్ కుమార్ చిన్నప్పటి పాత్ర పోషించాడు. 1948-54 మధ్యలో నాలుగు హిందీ చిత్రాలలో నటించాడు. శశికపూర్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం పట్ల హిందీ సినిమా రంగంలో సంతోషం వ్యకమవుతోంది.

current charges hike andhra pradesh

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈఆర్‌సి ఛైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ ఈ ఉత్తర్వులు విడుదల చేశారు. నెలకు 2 వందల యూనిట్ల పైన విద్యుత్ వాడకానికి ఛార్జీలు పెంచారు. గృహ విద్యుత్ విషయంలో 2 వందల యూనిట్ల వరకు ఛార్జీల పెంపు లేదు. వ్యవసాయానికి, కుటీర పరిశ్రమలకు ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎల్‌టీ కేటగిరీ - 3లో మరికొంతమంది ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. చక్కెర మిల్లులు, పౌల్ట్రీ పరిశ్రమలకు ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి 3,186 కోట్ల రాయితీ లభించిందని ఈఆర్‌సి ఛైర్మన్ తెలిపారు.

DK ravi

డీకే రవి లవ్ ఫెయిల్యూర్‌తో చనిపోయాడా?

  కర్ణాటకలో ఈ నెల 16న ఐఏఎస్ అధికారి డీకే రవి తన అపార్ట్ట్ మెంట్లో ఆత్మహత్య చేసుకన్న విషయం తెలిసిందే. డీకే రవి ఆత్మహత్యపై ఆ రాష్ట్ర ప్రజలు పలుఆందోళను చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేసును సీఐడీకీ అప్పగించగా అది మధ్యంతర నివేదిక ఇచ్చింది. అయితే ఈయన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మరో కథనం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన ప్రేమలో విఫలం అవ్వడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రోజు తన ఐఏఎస్ బ్యాచ్ మేట్ అధికారిణికి 44 సార్లు ఫోన్ చేశారని పోలీసులు చెప్పారు. సీఐడీ నివేదిక వచ్చిన అనంతరమే పోలీసులు తాజాగా ఈ కథనాలు బయటపెట్టడంతో కేసు పలుమలుపులకు దారితీస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికపై చర్చించాలని కోరగా, అందుకు కోర్టు నిరాకరించింది. విచారణ మధ్యలో ఉండగా వివరాలు బయటపెట్టొద్దని, కేసు విచారణ వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈయన కేసు విచారణను కర్ణాటక ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది.

ap capital

‘తెలుగువన్’ ఏనాడో చెప్పింది... ఏపీ రాజధాని ‘అమరావతి’

‘తెలుగువన్’ చెప్పిన నిజం మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ‘అమరావతి’ అనే పేరు పెట్టబోతున్నారని ‘తెలుగువన్’ నవంబర్ 12వ తేదీనే చెప్పింది. ఇప్పుడు ఆ పేరును అధికారికంగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి ‘అమరావతి’ అనే పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై త్వరలోనే ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఏపీ రాజధాని ప్రతిపాదిన ప్రాంతమైన తుళ్లూరుకు అమరావతి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుకు గత కొద్దికాలంగా పలు రకాల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.  కాగా రెండువేల సంవత్సరాల సంస్కృతికి, భవిష్యత్తుకు అద్దంపట్టే ‘అమరావతి’ అనే పేరు అయితే చారిత్రకంగా బాగుంటుందని  చివరకు రాష్ట్ర ప్రభుత్వం  అమరావతి అనే పేరుకే మొగ్గు చూపింది. అమరావతి అశోకుడి కాలం నుంచీ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. అలాగే ప్రసిద్ధ శైవక్షేత్రం కూడా. అలాగే శాతవాహనుల కాలంలో తెలుగువారికి రాజధానిగా విలసిల్లిన ధరణి కోట కూడా అమరావతి దగ్గర్లోనే వుంది. ఉజ్వలమైన భవిష్యత్తు వున్న ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమోఘమైన చరిత్ర కూడా వున్న అమరావతి పేరు పెట్టడం సముచితమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ రాజధానికి పెట్టడం వల్ల రాజధానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు చాలా త్వరగా వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బౌద్ధ ధర్మాన్ని ధ్వనించే పేరు రాజధానికి పెడితే రాజధాని అభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా ‘ఆఫర్’ ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి. అలాగే బౌద్ధ ధర్మం ప్రబలంగా వున్న జపాన్ లాంటి దేశాలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి బౌద్ధ ధర్మాన్ని ధ్వనించే పేరు పెట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాయని, అలాంటి పేరు పెడితే తాము భారీగా పెట్టుబడులు పెడతామని చెప్పాయన్న వార్తలు కూడా వచ్చాయి. ‘అమరావతి’ అనే పేరు రాజధానికి పెట్టడం వల్ల ఏపీ రాజధాని ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి జరిగి ప్రపంచ వ్యాప్తంగా వున్న కోట్లాది బౌద్ధులను ఆకర్షించే అవకాశం కూడా వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.     ఏపీ రాజధాని పేరు ‘అమరావతి’ అంటూ నవంబర్ 12న ‘తెలుగువన్’ ఇచ్చిన కథనాన్ని చూడాలంటే ఈ  లింక్ క్లిక్ చేయండి..  

బీజేపీలోకి నేదురుమల్లి కుమారుడు

  మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జానార్ధన రెడ్డి కుమారుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించారు. ఈయన ఆదివారం బీజేపీలో చేరిన సందర్భంగా జిల్లా కేంద్రంలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజేపీలో రాంకుమార్ రెడ్డి చేరిక తమకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు 'ప్రత్యేక హోదా' అంశాన్నికాంగ్రెస్ పార్టీ బిల్లులో ప్రస్తావించలేదని, ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండా సోనీయా గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల గొంతు కోసిందన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చాలా కృషి చేస్తుందన్నారు. రెవెన్యూ లోటును పూడ్చేందుకు ఐదేళ్లలో రూ.26,819 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రూ.1,000 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ నెల 28న తిరుపతిలో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గంగా, కావేరి నదులతోపాటు కృష్ణా, పెన్నా, గోదావరి నదులను అనుసంధానిస్తామన్నారు.

అమెరికాకి వ్యాపించిన రాష్ట్ర విభజన

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రభావం అమెరికా వరకు కూడా వ్యాపించింది. ఇంతవరకు అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళు అందరూ కలిసిమెలిసి పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేవారు. అమెరికాలో దాదాపు 10 లక్షల మంది తెలుగువారున్నారు. వారిలో 85 శాతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కాగా మిగిలిన 15 శాతం తెలంగాణాకు చెందిన వారు. తెలంగాణా ఉద్యమాలు ఉదృతం అయినప్పటి నుండి వారి మధ్య క్రమంగా దూరం పెరుగుతూ వస్తోంది. అయినా ఇంతవరకు అందరూ కూడా తానా, ఆటా, నాట్స్ వంటి సంస్థలలో సభ్యులుగా కలిసే ఉన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది గనుక తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) లో సభ్యులుగా ఉన్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన తెలుగువాళ్ళు వేరుపడి ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (టాటా)ను ఏర్పాటుచేసుకొంటున్నారు. నిజామాబాద్ ఎమ్.పి కవిత ఏప్రిల్ 5న న్యూజెర్సీలో ఈ సంఘాన్ని ప్రారంభిస్తారు.

చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దొంగలు పడ్డారు

    చెన్నై-సికింద్రాబాద్ చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలులో దొంగలు పడ్డారు. శనివారం అర్ధరాత్రి ప్రయాణికులు గాడనిద్రలో ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా రాపర్ల-ఉప్పుగుండూరు మధ్య చైన్ లాగి రైలును ఆపివేసి దాదాపు పది మంది దొంగలు ఎస్‌-10, 12, 13, 14 బోగీలలోని మహిళల మెడలో గొలుసులను దోచుకొని పోయారు. ప్రయాణికులు తెరుకోనేలోగా క్షణాల వ్యవధిలోనే దొంగలు నగలు దోచుకొని పారిపోయారు. గమ్మత్తయిన విషయం ఏమిటంటే అదే రైలులో ఒంగోలు రైల్వే ఎస్సై భావనారాయణ జనరల్‌ బోగీల్లో ఉన్నారు. ఇటీవల కాలంలో రైళ్ళలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రయాణికుల భద్రత కోసం కొంత మంది రైల్వే పోలీసులతో ఆయన డ్యూటీలో ఉన్నారు. కానీ దొంగలు చైన్ లాగి రైలుని నిలిపివేసి పక్కబోగీలలో దోపిడీ చేస్తున్నా అప్రమత్తమవకపోవడం విశేషం.   రైలు సికింద్రాబాద్ చేరుకొన్న తరువాత ప్రయాణికులు స్టేషన్ లో రైల్వే సీఐకి ఫిర్యాదు చేశారు. ఈవిషయం గురించి ఆయన ఉన్నతాధికారులకి తెలియజేయడంతో వారు ఒంగోలు రైల్వే ఎస్సై భావనారాయణను వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే రైళ్ళలో ఇటువంటి దోపిడీలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టేందుకు రైళ్ళలో పోలీసులు గస్తీ కూడా తిరుగుతున్నారు. కానీ ప్రయాణికులకి భద్రత కల్పించలేకపోతున్నారు. ఇక వారు దొంగలను పట్టుకోవడం, వారు దోచుకొన్న నగలు,డబ్బును స్వాధీనం చేసుకొని ప్రయాణికులకి తిరిగి అప్పజెప్పగలరని అనుకొంటే అది అత్యాశే అవుతుంది.