మోడీ కి కొత్త అర్ధం చెప్పిన వెంకయ్య
posted on Sep 7, 2015 @ 11:46AM
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు మోడీ మేకర్ ఆఫ్ డివలప్డ్ ఇండియా అంటూ కొత్త అర్ధాన్ని చెప్పారు. బదల్‌పూర్ - ఫరీదాబాద్ మెట్రో మార్గం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు హాజరయ్యారు. ఈసందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతు పైవిధంగా మోడీని ప్రశంసించారు. అంతేకాదు తాజాగా విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో ఫరీదాబాద్ ను చేర్చామని తెలిపారు.
అలాగే ప్రధాని మోడీ కూడా వెంకయ్య పైన ప్రశంసలు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు ప్రయోజనం కల్పించేందుకు ఆయన పలు ప్రధాన చర్యలు చేపడుతున్నారన్నారు. వెంకయ్య నాయకత్వంలో పలు మెట్రో ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. దేశంలో స్మార్ట్ సిటీల పధకానికి రూపకల్పన వెంకయ్య నాయుడేనని అన్నారు. అంతేకాదు వెంకయ్య నేతృత్వంలో వచ్చిన గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన వంటి పథకాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వెంకయ్య కృషి విజయవంతం కావాలని మోడీ ఆకాంక్షించారు.