funeral englend king recherd 3

పోయింది 1485లో.. అంత్యక్రియలు 2015లో....

  1485 సంవత్సరంలో చనిపోయిన ఒక రాజుగారికి 2015లో అంత్యక్రియలు జరిగాయి. అది కూడా బోలెడంతమంది అశ్రు నయనాల మధ్య. ఇంగ్లండ్‌లోని లైన్‌స్టర్‌లో 15వ శతాబ్దంలో మరణించిన రాజు రిచర్డ్-3కి ఆదివారం నాడు అంత్యక్రియలు జరిగాయి. క్రీస్తుశకం 1485లో యార్క్ వంశస్థుడైన రిచర్డ్-3కి, ట్యూటర్ అనే రాజుకి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రిచర్డ్-3 మరణించాడు. అయితే ఆయనను ఆ సమయంలో ఎక్కడ ఖననం చేశారన్నది మిస్టరీగా మిగిలిపోయింది. 2012లో పురావస్తు శాస్త్రవేత్తలు రిచర్డ్-3 అవశేషాలను కనుగొన్నారు. డీఎన్ఎ పరీక్షల ద్వారా ఆయన అవశేషాలను గుర్తించారు. దీంతో ఆయన అస్థికలకు తిరిగి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది కన్నీరు కూడా పెట్టుకున్నారు.

Shilpa Shetty

శిల్పాశెట్టి మోసగత్తె

  బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పెద్ద మోసగత్తె అంటూ ఆమె మీద కేసు నమోదైంది. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా భాగస్వాములుగా వున్న రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ సంస్థ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శిల్పాశెట్టి మోసగత్తె అంటూ కేసు నమోదైంది. తమను శిల్పాశెట్టి తొమ్మిది కోట్ల రూపాయలకు ముంచిందని కోల్‌కతాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఆరోపణలు చేసింది. ఆమెకి చెందిన కంపెనీలో 9 కోట్ల రూపాయలు తాము పెట్టుబడులు పెట్టామని, తిరిగి వాటిని చెల్లించకుండా ఆమె మోసం చేసిందని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. శిల్పా అండ్ రిపు సుదన్ కుంద్రా ఆఫ్ ఎస్సెన్షీయల్ స్టోర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని శిల్పా నడుపుతోంది. ఇందులో తాము పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఎంకే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కేసు పెట్టింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ శిల్పా, ఆమె కంపెనీపై నమ్మక ద్రోహం, మోసం, ఉద్దేశపూర్వక కుట్రతదితరమైనవి పేర్కొంటూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రెండేండ్లలో పదింతలు తిరిగిస్తామని పెట్టుబడులు పెట్టించి అనంతరం పట్టించుకోవడం మానేశారని ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.

Sachin Tendulkar farewell Test jersey fetches Rs 6 lakh

సచిన్ జెర్సీ విలువ ఆరు లక్షలు

  సచిన్ టెండూల్కర్ ధరించిన జెర్సీ ఆరు లక్షల ధర పలికింది. సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌లో ధరించిన జెర్సీకి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వేలం నిర్వహించారు. రకరకాల ఛారిటీ సంస్థల ప్రయోజనార్థం క్రిస్టీన్ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది. అనేక వస్తువులను ఈ సందర్భంగా వేలం వేశారు. ఈ వేలంలో సచిన్ ధరించిన జెర్సీ ఆరు లక్షలకు అమ్ముడైంది. జోధ్‌పూర్ రాజవంశానికి చెందిన శివ్‌రాజ్ సింగ్ అనే రాజు ఈ మొత్తాన్ని చెల్లించి జెర్సీని సొంతం చేసుకున్నాడు. సచిన్ జెర్సీతోపాటు పలువురు ప్రముఖులకు చెందిన వస్తువులను ఈ సందర్భంగా వేలం వేశారు. మొత్తమ్మీద ఈ వేలం ద్వారా సదరు సంస్థకు 80 లక్షల రూపాయలు సమకూరాయట. ఈ డబ్బును పేద పిల్లల వైద్యానికి ఉపయోగించనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Chiranjeevi

మెగాకుటుంబం మళ్ళీ ఒక్కటవ్వబోతోందా?

  చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములిద్దరూ కూడా సినీరంగంలో అత్యున్నత స్థాయికి చేరుకొన్నప్పుడు రాజకీయాలలోకి ప్రవేశించారు. కానీ వారిరువురు రాజకీయాలలో రాణించలేకపొతున్నారనే సంగతి అందరికీ స్పష్టంగా కనబడుతూనే ఉంది. అందుకే చిరంజీవి మళ్ళీ సినీపరిశ్రమకు వెళ్ళిపోయి తన 150వ సినిమాపై దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు జనాల ముందుకు వచ్చి ఏదో ఆవేశంతో మాట్లాడివెళ్ళిపోతున్నారు తప్ప సినీపరిశ్రమ వదిలిపెట్టే ఉద్దేశ్యం కనబడటం లేదు. కానీ వారిరువురు ప్రత్యర్ధ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలను భుజాలకెత్తుకోవడంతో వారి అభిమానులలో చాలా గందరగోళం ఏర్పడి రెండు గ్రూపులుగా చీలిపోవలసి వచ్చింది. కానీ అన్నదమ్ములిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్ళీ సినిమాలు చేస్తున్నప్పుడు, వారి అభిమానులు అందరూ కూడా ఒక్కటిగా కలిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బహుశః అందుకే చిరంజీవి అభిమాన సంఘాలు ఈరోజు హైదరాబాద్ లో సమావేశమవుతున్నాయి. ఒకప్పటి రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ, ప్రజలు వ్యతిరేకిస్తున్న ఆ పార్టీలో ఇంకా కొనసాగడమా లేక తనకు అచ్చిరాని రాజకీయాలు వదిలిపెట్టడమా లేకపోతే తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపి వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో జనసేన పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దడమా? అనే సందిగ్ధంలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. తన అభిమానుల కోరిక మేరకు ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కనుక ఈరోజు హైదరాబాద్ లో జరుగబోయే చిరంజీవి అభిమానుల సంఘాల సమావేశం చాలా కీలకమయినదేనని భావించవచ్చును.

nara nandamuri grand fathers brahmani lokesh

తాతలైన చంద్రబాబు, బాలకృష్ణ

  ఉగాది పర్వదినం రోజున నారా, నందమూరి కుటుంబాలు శుభవార్తను విన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ తాతలయ్యారు. చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ కుమార్తె.... నారా లోకేష్, బ్రహ్మణి దంపతులు తల్లిదండ్రులయ్యారు. బ్రహ్మణి ఉగాది రోజున హైదరాబాద్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా క్షేమంగా వున్నారు. ఉగాది పండుగ రోజున ఈ శుభవార్తను విన్న నారా, నందమూరి కుటుంబాల ఆనందానికి అవధులు లేవు. వీరు మాత్రమే కాకుండా నందమూరి వంశాభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మన్మథ నామ సంవత్సర ఉగాది నారా, నందమూరి వంశాలకు ఒక ప్రత్యేక ఉగాదిగా మారింది.

andhra pradesh ugadi tulluru anantavaram

ఏపీ తొలి ఉగాది అనంతవరంలో...

  నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఉగాది వేడుకలు గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, మాణిక్యాలరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లె వాతావరణాన్ని ప్రతిఫలించేలా వేడుకల వేదికను రూపొందించారు. ఈ వేడుకలలో ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Renuka Chowdary

రేణుకా చౌదరిపై పోలీస్ కేసు నమోదు

  మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరిపై ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసారు. ఆమెపై రాంజీ అనే స్థానిక నేత భార్య భూక్యా కళావతి ఆనే ఆమె కేసు వేసింది. గత ఎన్నికలలో తన భర్త రాంజీకి ఖమ్మం జిల్లాలో వైరా అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి రేణుకా చౌదరి తన భర్త వద్ద నుండి రూ.1.10 కోట్లు పుచ్చుకొన్నారని ఆమె ఆరోపించారు. కానీ రేణుకా చౌదరి తన భర్తకు ఆమె టికెట్ ఇప్పించకపోవడంతో ఆయన తీవ్ర మానసికవేదన అనుభవించి చనిపోయారని తెలిపారు. ఆ తరువాత ఆమెను తమ డబ్బు వాపసు చేయమని ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోగా, ఆమె తనను కులం పేరుతో దూషించారని, తాను ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు పిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో కళావతి హైకోర్టులో పిటిషను వేసారు. దానిపై స్పందించిన హైకోర్టు తక్షణమే రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసి విచారించమని పోలీసులను ఆదేశించడంతో వారు రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.   కానీ రేణుకా చౌదరి తనెన్నడూ ఆమెను కానీ, ఆమె భర్తని గానీ కనీసం చూడలేదని, తన రాజకీయ ప్రత్యర్ధులు తనను అప్రదిష్టపాలు చేసేందుకే ఈవిధంగా తనపై కుట్రలు పన్నుతున్నారని ఆమె మీడియాతో అన్నారు.

ఓడిన పాక్... సెమీస్‌లో భారత ప్రత్యర్థి ఆస్ట్రేలియా

  ప్రపంచ కప్ క్రికెట్ సెమీ ఫైనల్లో భారత జట్టుతో పోటీపడబోయే జట్టు ఆస్ట్రేలియా అని తేలిపోయింది. శుక్రవారం అడిలైడ్‌లో ఆస్ట్రేలియా - పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దాంతో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టుతో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో తలపడనుంది. ఆస్ట్రేలియా - పాకిస్థాన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాకిస్థాన్ మీద 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట్లోనే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత నిలదొక్కుకుని జాగ్రత్తగా ఆడుతూ స్కోరును పెంచింది. చివరకు 4 వికెట్లు కోల్పోయి 33.5 ఓవర్ల వద్ద లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో పాకిస్థాన్ ఇంటికి... ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్‌కి చేరుకున్నాయి.

భూగర్భ జలాలు పెంచాం... చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న కరువు తీవ్రతను ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రాంతాలలో నీటి కొరత చాలా ఎక్కువగా ఉందని అన్నారు. అనంతపురానికి హంద్రీనీవా ద్వారా నీళ్లు తీసుకెళ్లామని, భూగర్భ జలాలు పెంచామని చెప్పారు. రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు కూడా వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చూపించామని, 415 ప్రైవేటు బోర్ వెల్స్ తీసుకుని నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పధకాల ద్వారా కరువు మండలాల్లో పని దినాలు పెంచామని చెప్పారు. పశువులకు వసతి గృహాలు ఏర్పాటు చేసి వాటికి రూ. 3కే కిలో ఎండుగడ్డి, రూ. 8కే పశువుల దాణా సరఫరాచేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

పాకిస్థాన్... 213 ఆలౌట్

  ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా శుక్రవారం అడిలైడ్‌లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలు తలపడుతున్నాయి. పాకిస్తాన్ టాస్ గెలుచుకొని బ్యాటింగ్ ఎంచుకొంది. పాకిస్థాన్ తన ఇన్నింగ్స్‌లో 49.5 ఓవర్లకు 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే రెండు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. 22 పరుగుల స్కోరు దగ్గరకు వచ్చేసరికే రెండు వికెట్లను కోల్పోయింది. అహ్మద్ హెహజాద్ (5), షర్ఫాజ్ అహ్మద్ (10) పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ వికెట్లు ఒక్కటొక్కటే టపటపా రాలిపోయాయి. బోలెడంత స్కోరు చేయాలని బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ చివరికి 213 స్కోరు వద్ద తన ఇన్నింగ్స్‌ని ముగించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం ఖాయమని చెప్పకనే చెప్పింది.