టీచర్స్ పై వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
posted on Sep 5, 2015 @ 3:50PM
నాక్కొంచం తిక్కుంది.. కాని దానికో లెక్కుంది అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్టు.. అసలు రాంగోపాల్ వర్మకి ఉన్న తిక్కకి లెక్కే లేదనిపిస్తుంది. ఎప్పుడూ ఎవరిని ఏదో ఒకటి అనకపోతే రాంగోపాల్ వర్మకి నిద్రపట్టదు. తన విమర్శల బాణాలకి అందరిని బలి చేస్తుంటాడు. తన విమర్శలతో ఆఖరికి దేవుడిని కూడా బలి చేశాడు ఇంక మనుషులెంత. మరి ఇప్పుడు ఎవరి మీద విమర్శలు చేసాడనే కదా డౌట్.. ఈరోజు టీచర్స్ సందర్భంగా వర్మగారు టీచర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఏ ఒక్కరికి హ్యాపీ టీచర్స్ డే అని చెప్పనని.. ఎందుకంటే ఒక్క రోజు కూడా తాను గురువులతో సంతోషంగా లేనని విమర్శించారు.
సక్సెస్ ఫుల్ ఇంజినీర్స్, సక్సెస్ ఫుల్ డాక్టర్స్ ఉన్నారు. కాని, ఎక్కడైనా సక్సెస్ ఫుల్ టీచర్చ్ ఉన్నారా? కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తీసినట్లుగా ఎవరైనా ‘టీచర్ ఆప్ ది ఇయర్’ చేస్తే, అది ‘డిజాస్టర్ ఆప్ ది ఇయర్’ అవుతుంది అని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్లు చేశారు.