వైసీపీకి గాలి కౌంటర్
posted on Sep 7, 2015 @ 6:44PM
టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చంద్రబాబు నివాసంపై వైఎస్సార్ పార్టీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రం విజయవాడలోని తన నివాసంలో కాలుపెట్ట్టిన సంగతి తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అతిథి గృహంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ చంద్రబాబు ఉంటున్న అతిధి గృహం అక్రమంగా నిర్మించారని.. దానిలో చంద్రబాబు ఏలా ఉంటారని రాద్దాంతం చేస్తున్నారు. దీనికి గాలి చంద్రబాబు నాయుడు నివాసం కోసం తీసుకున్న భవనాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కట్టారని కౌంటర్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఆక్రమం అంటూ వైసీపీ నేతలు రాద్దాంతం చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవ చేశారు. ప్రతి విషయాన్నీ విమర్శించడం సరి కాదని హితవు పలికారు. ఎపికి రాజధాని నిర్మించాలా వద్దా, పట్టిసీమ కావాలా వద్దా అనే విషయాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.