చంద్రబాబు ఫైర్.. ఉద్యోగం చేస్తున్నావా? ఆడుకుంటున్నావా?
posted on Sep 7, 2015 @ 12:09PM
ఏపీ సీఎం చంద్రబాబు ఉద్యోగుల పనితీరుపై ఎప్పటికప్పుడు వారికి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ అధికారులు సరిగ్గా విధులు నిర్వహించకపోతే చర్యలు తీసకోవాల్సి వస్తుందని కూడా చెప్పారు. దీనిలో భాగంగానే విశాఖపట్నంలోని జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబు విశాఖపట్నం పర్యటన చేశారు. సుమారు 6 గంటల పాటు నగరాన్ని పర్యటించిన ఆయన అక్కడ మనోరమ థియేటర్ వద్ద కల్వర్ట్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడంపై జోనల్ కమిషనర్ శ్రీనివాస్ ను ‘‘ఉద్యోగం చేస్తున్నావా? ఆడుకుంటున్నావా!?’’ అని అతనిపై మండిపడ్డారు. పారిశుద్ధ్య వ్యవస్థ, పోర్టు కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడేలా పోర్టు కార్యకలాపాలు సాగుతున్నాయని, వీటికి తెరదించాలని స్పష్టం చేశారు. విధులు సరిగ్గా నిర్వహించకపోతే పాత చంద్రబాబుని చూస్తారు అని హెచ్చరించినట్టే చంద్రబాబు చేస్తున్నట్టు తెలుస్తోంది.