రోజులు దగ్గర పడ్డాయి.. వీహెచ్

  కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతురావు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు వదిలారు.  పార్టీ కార్యకర్తలతో కలిసి మూకుమ్మడిగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడానికి పూనుకున్న ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.. రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అయినా అధికార ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. కేసీఆర్ రైతులపై వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాలేదని.. రైతుల గోడు పట్టించుకోకుండా ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలను లెక్కచేయకుండా.. కనీసం వారి కుటుంబాలను కూడా పరామర్శించకుండా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తీరుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ఆయన నియంతృత్వ పాలనకు చరమగీతం పాడతారని ఎద్దేవ చేశారు.

దొంగబ్బాయ్ అంటూ లోకేష్ పంచ్ డైలాగ్ లు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్...పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. దొంగబ్బాయ్ అంటూ జగన్ ను, మా అక్క అంటూ షర్మిలపై సెటైర్లేశారు. తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుని బతకడం కాదన్న లోకేష్, వాళ్ల స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలంటూ, వారసత్వ రాజకీయాలపై కామెంట్ చేశారు. తండ్రి పేరు చెప్పుకుని, సానుభూతి పొందాలని చూస్తున్న దొంగబ్బాయ్ జగన్ ఆటలు ఇంకా ఎంతోకాలం సాగవన్న చినబాబు... మాయమాటలు, అబద్దాలతో టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికీ తండ్రి పేరు చెప్పుకుని బతుకుతూ, రాజకీయాలు చేస్తున్న జగన్...తన కార్యకర్తలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తామైతే ఎన్టీఆర్ స్ఫూర్తితో కార్యకర్తల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, జగన్ లాగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేలకోట్ల దొంగ డబ్బు సంపాదించడం లేదంటూ విపక్ష నేతను చెడుగుడు ఆడుకున్నారు.

అయ్యో గవర్నర్.. ఇదీ లాగేసుకున్నారు

  రెండు రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ మొదటి నుండి ఏదో గవర్నర్ గా ఉన్నారు అంటే ఉన్నారు అనే ధోరణిలోనే కొనసాగారు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు పెద్దగా గవర్నర్ గారికి అంత ఇబ్బందికర సమస్యలు ఏం రాలేదు కాని ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పటినుండి ఆయనకు చిక్కులు పోయి మొదలయ్యాయని మాత్రం అందరికి స్పష్టంగా తెలిసిన విషయమే. చిటికీ మాటికీ రెండు రాష్ట్రాలు గిల్జికజ్జాలు పెట్టుకోవడం దాని పరిష్కారానికి గవర్నర్ దగ్గరకి వెళ్లడం ఆయన ఎటూ తేల్చుకోలేక పోవడం దీనివల్ల రెండు రాష్ట్రాలు ఆయనపై విమర్శలు చేయడం ఇదే తంతూ. అయితే నోటు ఓటు కేసు తరువాత గవర్నర్ గారి పరిస్థితి మరీ అయోమయ స్థితిలో పడింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు.. రెండు రాష్ట్ర సీఎంల మధ్య పోరు కాబట్టి ఏం నిర్ణయం తీసకుంటే ఏం సమస్య వచ్చిపడుతుందో అని తను సొంతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు కూడా కేంద్రాన్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. పాపం ఈవిషయంలో కేంద్రం కూడా గవర్నర్ గారి పనితీరుపై కాస్తంత అసంతృప్తి వెల్లబుచ్చింది కూడా. అన్ని సమస్యలకు కేంద్రం దగ్గరకి వస్తే కాదు మీరే ఇరు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కూడా సూచించారు. ఇవన్నీ తట్టుకోలేక ఒకానొక దశలో గవర్నర్ నరసింహన్ రాజీనామా చేద్దామనుకున్నారు. కానీ అప్పుడు కేంద్రం బుజ్జగించింది. కానీ ఎప్పుడైతే తను ఆగష్టు 15న ఇచ్చిన విందుకు ఇరు సీఎంలు డుమ్మాకొట్టారో దానికి గవర్నర్ బాగా మనస్తాపం చెంది తానే స్వచ్చందగా పదవి నుండి తొలిగిపోవాలనుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈసారి మాత్రం కేంద్రం బుజ్జగించకుండా తను తీసుకున్న నిర్ణయానికి అంగీకరించి ఆయన స్థానంలో ప్రస్తుతం కేరళ గవర్నర్ గా వ్యవహరిస్తున్నసుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివంను నియమించాలని కేంద్రం బలంగా భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరోసారి గవర్నర్ ను చులకన చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే తనకు గుర్తింపు లేదని భావించి రాజీనామాకు సిద్దపడిన గవర్నర్ కు తెలంగాణ సర్కార్ మరో విషయంలో కూడా గవర్నర్ కు గుర్తింపు లేకుండా చేస్తుంది. అందేంటంటే సాధారణంగా యూనివర్శిటీలకు గవర్నరే చాన్స్ లర్ గా ఉంటారు. అయితే కేసీఆర్ మాత్రం యూనివర్శిటీలకు చాన్స్ లర్లను నియమించే బాధ్యత రాష్ట్ర అధికార ప్రభుత్వానికే ఉంటుందని.. ఇక నుండి వారిని ప్రభుత్వమే నియమిస్తుందంటూ తేల్చిచెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య జారీ చేశారు. అయితే గవర్నర్ కు కాకుండా ఈ బాధ్యతలు వేరేవారికి ఇస్తే కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోని విశ్వ విద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ద్వారా విశ్వ విద్యాలయాలకు నిధులు రావడం కష్టసాధ్యమని అధికారులు చెప్పినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అవసరమైతే ఈ విషయంపై కేంద్రంతో కూడా మాట్లాడతానని చాలా పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు  చాన్స్ లర్ గా గవర్నరే ఉండాలని ఎక్కడా నిబందనలు ఉన్నాయా అని తిరిగి ఎదురు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ గవర్నర్ కు ఈ అధికారం కూడా లేకుండా లాగేసుకున్నారు.

హైదరాబాద్ లో స్వైన్ ప్లూ స్వైరవిహారం

హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ మళ్లీ స్వైరవిహారం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి 2015లో ఇప్పటివరకూ 63మంది మ..త్యువాత పడగా, తాజాగా మరో పది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా నగరంలో కురుస్తోన్న వర్షాలకు,వాతావరణం అనుకూలంగా మారి, వైరస్ మళ్లీ పంజా విసురుతోందని అంటున్నారు. గత పది రోజుల్లో  31 కేసులు నమోదు కాగా, ఇద్దరు మ..త్యువాడ పడ్డారని వైద్యులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజూ రెండు కేసులు నమోదవుతుండగా, చాలామంది స్వైన్ ఫ్లూ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే వైరస్ వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా మారిందని, రానున్నది చలికాలం కావడంతో స్వైన్ ఫ్లూ మరింత విజం..భించే అవకాశముందని వైద్యులు అంటున్నారు. మధుమేహం, రక్తహీనత, గుండెజబ్బులు, టీబీ, హెచ్‌ఐవీ, న్యుమోనియో, ఆస్తమా వంటి జబ్బులున్న వారే ఎక్కువగా దీని బారిన పడుతున్నందున, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

కర్నాటకలో ఘోర రైలు ప్రమాదం

కర్నాటకలో రైలు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ఎల్టీటీ దురంతో ఏసీ ఎక్స్ ప్రెస్(ట్రైన్ నెంబర్ 12990)... తెల్లవారుజామున రెండున్నర గంటలకు షాహబాద్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది, ఈ ప్రమాదంలో బీ8 కోచ్ పూర్తిగా దెబ్బతినడంతో, 8మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు, మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని, ప్రమాద కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాదం వెనుక కుట్ర కోణం కూడా ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రాత్రిపూట ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని, చిమ్మచీకట్లో క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయినట్లు రెస్క్యూ టీమ్స్ తెలిపాయి. దాంతో మతుల సంఖ్య పెరిగే అవకాశముందని రైల్వే అధికారులు అంటున్నారు. మరోవైపు ప్రమాదం కారణంగా సికింద్రాబాద్-ముంబై, చెన్నై ప్రధాన మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించగా, మరికొన్ని రైళ్లను రద్దుచేశారు. రైలు ప్రమాదంపై విచారం వ్యక్తంచేసిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.

సోనియాను రాహుల్ ను కాల్చిపారేయాలి.. గాలి

  టీడీపీ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ఆమె తనయుడు రాహుల్ గాంధీ పై దుమ్మెత్తిపోశాడు. చైన్నై మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన కేవలం పార్టీ ప్రయోజనాల కోసం.. తన పుత్ర రత్నాన్ని పీఎం చేయాలన్న రాజకీయ దురుద్దేశంతో నే సోనియాగాంధీ అంత హడావుడిగా రాష్ట్రాన్ని విడదీసిందని మండిపడ్డారు. అప్పుడ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీసి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడతామంటూ.. నాటకాలు ఆడుతుందంటూ ఎద్దేవ చేశారు. అసలు రాష్ట్రాన్ని విభజించినప్పుడే ప్రత్యేక హోదా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఉంటే ఇప్పుడు ఏపీకి ఇన్ని తిప్పల్లు వచ్చేవి కాదని అన్నారు. అప్పుడు బోఫోర్స్ గన్ ల కుంభకోళంలో రాజీవ్ గాంధీ ఖ్యాతి దిగజార్చిన సోనియా ఇప్పుడు ఏపీని విడగొట్టి ఆపాపాన్ని మూటగట్టుకుందని అన్నారు. అసలు ఏపీని విడదీసిన సోనియాను.. రాహుల్ ను ఇద్దరిని ఆ తుప్పు పట్టిన బోఫోర్స్ గన్ లతో కాల్చేయాలని.. అలా కాల్చేసిన వారి పాపం పోదని తీవ్రస్థాయిలో వారిమీద మండిపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యే కారు బోల్తా.. తలకి గాయాలు

  తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కారు ప్రమాదానికి గురయ్యారు.  ఎమ్మెల్యే బుచ్చి బాబు ఆయతో పాటు మాజీ ఎమ్మెల్యే చైతన్యరాజు కొంత మంది ఎమ్మెల్యేలు కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లగా అక్కడ బుచ్చిబాబు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బుచ్చిబాబు తీవ్రంగా గాయపడ్డారు.. ఆయన తలకు దెబ్బ తలగడంతో అక్కడి ఆస్పత్రికి తరలించగా ఆయన తలకు 12 కుట్లు పడ్డాయి. అయితే బుచ్చిబాబుకు ప్రమాదం జరిగినట్టు ఆయన ఇక్కడికి వచ్చేంత వరకూ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో ఆయనకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు వెంటనే ఆయనను పరామర్శించారు. ప్రస్తుతానికి బుచ్చిబాబు ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.

సింగపూర్ లో పీఏపీ విజయం, టీడీపీ హ్యాపీ

    సింగపూర్ సాధారణ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ మళ్లీ ఘనవిజయం సాధించింది. 1965 నుంచి 50ఏళ్లుగా ఏకచత్రాధిపత్యంగా సింగపూర్ ను ఏలుతున్న పీఏపీ...మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంది.ప్రధాని లూంగ్ ఆధ్వర్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించిన పీపుల్స్ యాక్షన్ పార్టీ...89 సీట్లకు గానూ, 60 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారైనా పీఏపీను ఓడించాలనుకున్న ప్రతిపక్షం కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. అయితే సింగపూర్ లో అధికార పార్టీ గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ కి లింకేంటి అనుకుంటున్నారా?, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం...మళ్లీ అక్కడ లూంగ్ సర్కారే రావడంతో ఊపిరిపీల్చుకుంది. పాత ప్రభుత్వమే మళ్లీ పవర్ లోకి రావడం వల్ల...ఏపీ రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ రావని భావిస్తున్నారు, అందుకే సింగపూర్ లో అధికార పార్టీ ఘనవిజయం సాధించడంతో, ఇక్కడ టీడీపీ శ్రేణులు కూడా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేస్తామంటూ సీఎం చంద్రబాబుకు సింగపూర్ ప్రధాని లూంగ్ లేఖ రాయడం...తెలుగుదేశం పార్టీకి సంతోషాన్నిచ్చింది.

ఏంటీ...జగన్ దీక్షలు ఫ్యాషన్ షోల్లాగా ఉన్నాయా?

    నిజమే ఇప్పుడు దీక్షలు చేయడం కూడా ఒక ట్రెండ్ లా, ప్యాషన్ లాగా మారిపోయాయి.గతంలో దీక్ష అంటే అదో పెద్ద సంచలన వార్త అయ్యేది,ఇప్పుడు చీటికీమాటికీ, ఎవరుపడితే వాళ్లు...దీక్షలు అంటుంటే...అటు ప్రజలు, ఇటు మీడియా ఇద్దరూ పట్టించుకోవడం మానేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే...దీక్షలను తనకు పేటెంట్ గా మార్చేసుకున్నారేమోనని అనిపిస్తుంది. జలదీక్ష, ఫీజు దీక్ష, రైతుదీక్ష...ఇలా అనేక రకాల దీక్షలు చేసిన జగన్...ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా మరో దీక్షకు పూనుకున్నారు. అయితే జగన్ దీక్షలు...ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయంటూ మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ విచిత్రమైన కామెంట్ చేశారు.జగన్ దీక్షల్లో కసి లేదని, ప్రజలను మభ్యపెట్టడానికే నాటకాలాడుతున్నారని కారెం ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటే...ఏ పార్టీకి పుట్టగతులుండవంటూ హెచ్చరించారు.

టీడీపీ కార్యకర్తలకు కీలక పదవులు

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ, టీడీపీ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించే కార్యకర్తలకు ఏదో ఒకటి చేయాలని పరితపిస్తున్న చంద్రబాబునాయుడు...మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీ సంక్షేమ నిధి...ద్వారా కార్యకర్తలకు అండదండలందిస్తున్న పార్టీ...ఏపీలో సుమారు లక్షమంది కార్యకర్తలకు పదవీయోగం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. పెద్దపెద్ద పదవులు కాకపోయినా, తమతమ గ్రామాల్లో గుర్తింపు లభించేలా పదవులు ఇవ్వనున్నారు. ఇప్పటికే కొందరికి ఇలాంటి పదవులు కల్పించినా, మరికొందరికి ఇవ్వడం ద్వారా కిందిస్థాయి కార్యకర్తలను సంతృప్తి పర్చాలనుకుంటున్నారు. ఏపీలో ప్రస్తుతం 16వేల కమిటీలు పనిచేస్తుండగా, వాటిలో దాదాపు 32వేల మంది కార్యకర్తలకు చోటు కల్పించగా, తాజా నిర్ణయంతో మరో లక్షమందికి ఇలాంటి అవకాశం దక్కనుంది. ఈ కమిటీల ద్వారానే గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించనున్నారు. అన్ని కమిటీల్లోనూ టీడీపీ కార్యకర్తలు ఉంటేనే, ప్రభుత్వానికి తగిన సమాచారం అందుతుందని, తద్వారా గ్రామాల్లో రాజకీయంగా పట్టు సాధించడానికి, పలుకుబడి పెంచుకోవడానికి, ప్రజలు సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3400 చిన్న దేవాలయాలకు కమిటీలను నియమించి, వాటిలో 30వేల మంది కార్యకర్తలకు చోటు కల్పించనున్నట్లు తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. వీటితోపాటు పైస్థాయి పదవుల భర్తీపైనా దష్టిపెట్టిన హైకమాండ్ ...జిల్లా గ్రంథాలయాలకు ఛైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ సలహా మండళ్లు నియమించే పనిలో పడింది.

ఫ్యాన్స్ చేసిన నష్టం.. చెల్లిస్తానన్న పవన్

  పవన్ కళ్యాణ్ ను అతని అభిమానులు ఎంతలా ఆదరిస్తారో మాటల్లో చెప్పడం కొంచెం కష్టమైన పనే. అతనంటే అభిమానుల్లో ఎంత క్రేజో అందరికి తెలిసిందే. ఎందుకంటే అభిమానులు అతనంటే ఎంత ఇష్టపడతారో పవన్ కూడా వారిపట్ల అంతే ప్రేమతో ఉంటారు కాబట్టి. అభిమానులంటే తనకి ఎంత ఆదరాభిమానాలో మరోసారి రుజువు చేశారు పవన్. సెప్టెంబర్ 2 తన పుట్టిన రోజు సందర్భంగా భీమవరంలో అభిమానులు పవన్ కు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్లేక్సీలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నాశనం చేసిన నేపథ్యంలో అక్కడ రెండు మూడు రోజుల పాటు పెద్ద గొడవలే జరిగాయి. అటుపోయి ఇటు పోయి ఆఖరికి ఆ గొడవ కాస్త కుల వివాదాల వరకూ వెళ్లింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఎటువంటి గొడవలు చేయోద్దని.. భౌతిక దాడులు తనకు నచ్చవని సూచించారు. దీంతో గొడవ కాస్త సద్దుమణిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చేసిన గొడవలకి అక్కడ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు కొంచెం నష్టం కలిగింది. దీంతో తన అభిమానులు చేసిన నష్టానికి పరిహారాన్ని తనే చెల్లిస్తానని ముందుకు రావడం జరిగింది. దీనిలో భాగంగానే ముందుగా ఓ మూడు లక్షల రూపాయలని భీమవరం ఎస్ఐకి పంపించారట. అభిమానులకు ఏదైనా నేనున్నా అంటూ ముందుంటారు కాబట్టే పవన్ అంటే వారికి అంత ప్రేమ.. ఓరకంగా చెప్పాలంటే పిచ్చి. Pawan Kalyan's SARDAR First Look Motion Poster  

ఆ 40మంది ఎంపీలూ...కుట్ర చేస్తున్నారు

  400మంది ఎంపీలు దేశాభివృద్ధి కోసం పరితపిస్తుంటే, ఓ 40మంది ఎంపీలు మాత్రం కుట్ర చేస్తున్నారంటూ నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలుచేశారు. బీజేపీపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ నిప్పులు చెరిగిన మోడీ...దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పార్లమెంట్ లో ప్రజాసమస్యలను చర్చించకుండా తమ గొంతు నొక్కితే, జనసభకు (జనాల్లోకి) వెళ్తామని, ఇది రాజ్యసభ కంటే పెద్ద సభ అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అహంకారంతో ప్రవర్తిస్తున్నారని మోడీ మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న ఆయన, ఇలానే వ్యవహరిస్తే భవిష్యత్ లో కూడా కాంగ్రెస్ ను క్షమించరని హెచ్చరించారు.

రఘువీరాని ఇంటికెళ్లి మరీ కొడతా.. జేసీ

  టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరాడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ రఘువీరారెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి రఘువీరా రెడ్డిపై తిట్ల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ కేసులు పెడుతున్నారు.. పద్దతి మార్చుకోకపోతే రఘువీరా ఇంటికి వెళ్లి మరీ కొడతానని హెచ్చరించారు. అంతేకాదు కేవలం పార్టీ ప్రయోజనాలకే రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో ప్రజల కోసం మేమున్నామంటూ దొంగనాటకాలాడుతుందని.. మొసలి కన్నీరు కార్చుతుందని విమర్శించారు.   కాగా రఘువీరా రెడ్డి పెట్టిన కేసుకు ప్రతీకారంగా బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీసిందని కాంగ్రెస అధ్యక్షురాలు సోనియాగాంధీ.. మన్మోహన్ సింగ్.. దిగ్విజయ్ సింగ్ పై కేసులు పెట్టారు.

కేసీఆర్ ను భయపెడుతున్న కరీంనగర్ మాజీ ఎంపీ

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సెటైర్ల మీద సెటైర్లేస్తున్నారు. కేసీఆర్ చైనా వెళ్లిన వెంటనే, స్పీకర్ ను వెంట తీసుకెళ్లడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పొన్నం, ఈసారి వర్షాల సెంటిమెంట్ ను పండించి టీఆర్ఎస్ లో దడ పుట్టించారు. కేసీఆర్ ...తెలంగాణకు శనిగా దాపురించారని, అందుకే ఆయన చైనా వెళ్లిన వెంటనే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు. మరి కొన్నాళ్లు కేసీఆర్ చైనాలోనే ఉంటే బాగుంటుందని...తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉంటారని ఎద్దేవా చేశారు. ట్యాంక్ బండ్ పై సూసైడ్ చేసుకున్న లింబయ్య... వ్యవసాయ కారణాలతో ఆత్మహత్య చేసుకోలేదన్న మంత్రుల వ్యాఖ్యలపై పొన్నం ఫైరయ్యారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోకుండా, అనుచితంగా మాట్లాడాతారా అంటూ నిప్పులు చెరిగారు. లింబయ్య ఆత్మహత్యపై బహిరంగ చర్చకు రావాలంటూ...గులాబీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1200మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 55మందికే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించిన పొన్నం... ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 5లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పాఠాలు చెబుతున్న నారా లోకేష్

  నారా లోకేష్ ...టీచర్ అవతారమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న చినబాబు...కార్యకర్తలకు పాఠాలు చెబుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన టీడీపీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న లోకేష్...పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాలపై కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శలను ఎలా తిప్పికొట్టాలో శిక్షణ ఇస్తున్నారు.ప్రభుత్వంపై దుష్ఫ్రచారాన్ని కార్యకర్తలే అడ్డుకోవాలన్న లోకేష్... జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్న ఆయన... రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు.

హైదరాబాద్ లో కలకలం... లేడీ టెర్రరిస్ట్ అరెస్ట్

  హైదరాబాద్ లో ఓ మహిళా తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించిన ఖాకీలు...శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ చెక్కేస్తున్న లేడీ టెర్రరిస్ట్ నిక్కీ జోసెఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ దేశస్తురాలైన నిక్కీ జోసెఫ్... గతేడాది అరెస్టయిన ఉగ్రవాది మొయినుద్దీన్ కి ప్రియురాలని, ఈమెకు ఐఎస్ఐఎస్ తో సంబంధాలు కూడా ఉన్నాయని, పలువురు యువకులను ఐసిస్ లో చేర్చేందుకు ప్రయత్నించిందని పోలీసులు వెల్లడించారు. ప్రియుడు మొయినుద్దీన్ తో కలిసి ఫేస్ బుక్ అకౌంట్ ను ఓపెన్ చేసి...ఐసిస్ కోసం పనిచేసిందంటున్న పోలీసులు...పక్కా సమాచారంతోనే అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. నిక్కీ జోసెఫ్ ను దుబాయ్ నుంచి హైదరాబాద్ కి రప్పించడంలో తాము పన్నిన వ్యూహం వర్కవుట్ అయ్యిందంటున్న ఖాకీలు...నగరంలో ఆమెకున్న పరిచయాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఐసిస్ లో చేరేందుకు వెళ్తూ...ఇప్పటివరకూ 30మంది అరెస్ట్ అయ్యారని, వాళ్లకూ నిక్కీకి ఏమైనా సంబంధాలున్నాయా? వీళ్లలో ఎవరికైనా ఎర వేసిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఓ లేడీ టెర్రరిస్ట్ అరెస్ట్ అవ్వడం మాత్రం కలకలం రేగుతోంది. ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో మాత్రమే కనిపించే లేడీ టెర్రరిస్టులు... మన భాగ్యనగరంలో ఉన్నారని తెలుసుకుని ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు.

రేవంత్ పై టీఆర్ఎస్ మరో స్కెచ్ వేయనుందా?

  తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం.. వారికి ధీటుగా సమాధానం చెప్పగల సామర్థ్యం ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మిగిలిన పార్టీ నేతలు మాట్లాడలేరా అంటే మాట్లాడలేరని కాదు కాని రేవంత్ రెడ్డి అంత వాక్చాతుర్యం.. వారి మాటను తిప్పికొట్టి మాట్లాడగల సత్తా వారికంటే కొద్దిగ ఎక్కువగా రేవంత్ రెడ్డికే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి మాటలకు భయపడతారని రాజకీయ వర్గాలు చెప్పుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే ఎవ్వరి మీద ఫోకస్ చేయకుండా కేవలం రేవంత్ రెడ్డి మీద మాత్రమే ఫోకస్ పెట్టి చాలా పథకం ప్రకారం ఓటుకు నోటుకేసులో ఇరికించారు. అయితే టీఆర్ఎస్ కూడా కావాలనే రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. తమ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డికి ఎలాగైనా మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని చూస్తుంది. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం సరిగా రాలేదు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చేప్తేకాని మాట్లాడే అవకాశం ఇచ్చేది లేదని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నేతలు కాని రేవంత్ రెడ్డి మాత్రం క్షమాపణలు చెప్పలేదు.. అలా రేవంత్ మాట్లాడకుండానే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముగిసిపోయాయి. ఆ తరువాత నోటుకు ఓటు కేసులో ఇరికించాయి.. దీనివల్ల రేవంత్ రెడ్డికి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అందరిలో ఉన్న సందేహం ఏంటంటే ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఎలా కట్టడి చేస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాములుగానే ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు. మరి అలాంటిది ఇప్పుడు అసలే పులి అందులోనూ దెబ్బతిని ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ పై తన పంజా విసరడానికి సిద్దంగా ఉన్నాడు. అసలు కేసు తర్వాత షరతులతో కూడిన బెయిల్ మీద బయటకొచ్చినప్పుడే కేసీఆర్ పై ఒక రేంజ్ లో విమర్శల బాణాలు వదిలాడు. నాకు బెయిల్ వచ్చింది కేసీఆర్ కు జ్వరం వచ్చిందంటూ ఆయనపై మండిపడ్డాడు. ఇప్పుడు హైకోర్టు ఆ షరతులను కూడా సడలింపు చేస్తూ రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు అని చెప్పిన చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లో అడుగు పెట్టిన రేవంత్ రెడ్డి అలా వచ్చాడో లేదో కేసీఆర్ ను ఏకిపారేశాడు. సింగం వచ్చింది కేసీఆర్ చైనా పారిపోయాడు అంటూ.. ఆట కాదు వేట మొదలైందంటూ.. తాడో పెడో తేల్చుకుంటానంటూ సవాళ్లు విసిరారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీ అంత తేలికగా తీసుకోనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే  ఈనెల 27 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి తమ పార్టీని ఇరుకున పెట్టేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోందని అనుకుంటున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిలో భాగంగానే  రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేక్ వేసేందుకు టీఆర్ఎస్ ఏం స్కెచ్ వేస్తుంది అని పలు అను మానాలు రేకెత్తున్నాయి. అయితే ముందు ఓటుకు నోటు కేసుపై సభ నుండి సస్పెండ్ చేద్దామని అనుకున్నా దాన్ని విరమించుకున్నారు. ఎందుకుంటే ఇప్పటికే ఓటు నోటు కేసు వల్ల రేవంత్ రెడ్డికి మంచి గుర్తింపు వచ్చిందని.. ఇప్పుడు అదికూడా చేస్తే రేవంత్ రెడ్డి హీరో అయిపోతాడని ఆగిపోయారంట. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి మాత్రం టీఅర్ఎస్ పార్టీ బానే భయపడుతుందని చెప్పొచ్చు.

చినబాబుకు పార్టీ పగ్గాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను... త్వరలో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేస్తారని తెలుస్తోంది. పార్టీ పగ్గాలు చినబాబుకు అప్పగించాలని ఎప్నట్నుంచో కార్యకర్తలు కోరుతున్నా, సరైన సమయం కోసం బాబు వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తూ, సభ్యత్వ నమోదులోనూ సత్తా చాటిన లోకేష్...ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. పాలనా వ్యవహారాల్లో చంద్రబాబు బిజీగా ఉంటుంటే...చినబాబు పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారని, ఈ నేపథ్యంలోనే లోకేష్ కు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారట. అయితే ఏపీ, తెలంగాణకు సెపరేట్ గా అధ్యక్షులను నియమించినా, రెండు రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను చినబాబే పర్యవేక్షిస్తారని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాలు అంటున్నాయి.