అధికారులకు వైకాపా నేత చెవిరెడ్డి వార్నింగ్
posted on Sep 8, 2015 @ 10:10AM
సాధారణంగా అధికారులు అందరూ ప్రభుత్వాదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంటారు. వారి వ్యక్తిగత రాజకీయ ఇష్టాఇష్టాలను పక్కనబెట్టి అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ దాని ఆదేశాలను విధిగా అమలుచేయవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. అందుకు వారిని ఎవరూ తప్పు పట్టడానికి లేదు. కానీ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వాధికారులను తప్పు పడుతున్నారు. త్వరలోనే తెదేపా ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, త మ పార్టీ అధికారంలోకి రాగానే, తెదేపా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు అందరిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అంతేకాదు వారిపై కక్ష తీర్చుకొంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను ఈవిధంగా బెదించడం చాలా తప్పు. నేరం కూడా. వైకాపా అధికారంలోకి వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. కానీ అధికారంలో లేనప్పుడే ఒకవేళ వైకాపా అధికారంలోకి వస్తే ఏవిధంగా వ్యవహరిస్తుందో చెవిరెడ్డి ముందే చాటి చెప్పుకొన్నట్లయింది.