బిఏసీ సమావేశం నుంచి టీడీపీ వాకౌట్
ఆదివారం ఉదయం జరిగిన శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బిఎసి) సమావేశం నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు నేతలు వాకౌట్ చేశారు. శాసనసభ సమావేశాలు 4రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై సమావేశం నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. 20 అంశాలపై 20 రోజులపాటు సమావేశాలు జరపాలని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కోరారు. ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీ నామా, కళంకిత మంత్రులపై ముఖ్యమంత్రి వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, శోభానాగి రెడ్డి హాజరయ్యారు. టీడీపీ నుంచి మోత్కుపల్లి నరసింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర పార్టీల శాసనసభ పక్షనేతలు హాజరయ్యారు.