జైపాల్ రెడ్డికి సీఎం కుర్చీ?
posted on Sep 15, 2012 @ 8:01PM
"రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని మార్చేసి ఆ స్థానాన్ని జైపాల్ రెడ్డికిచ్చేస్తారు. బదులుగా కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర కేబినెట్ బెర్త్ కూడా ఖరారయ్యింది. " ఏపీ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారమిది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. సీనియర్ నేతలు ఈ విషయాల్ని ఖండిచండంలేదు అలాగని రూఢి చేయడమూ లేదు. లోపల్లోపల ఏదో జరుగుతోంది.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్విరాజ్ చవాన్ తో పాటు ఎపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలను కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుని, ఈ రెండు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులను నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మహారాష్ట్రకు నారాయణ రాణేని, ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారం. శుక్రవారం రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్‌లతో సోనియా గాంధీ చర్చలు జరిపారని, త్వరలోనే నిర్ణయం అమలౌతుందని తారా స్థాయిలో వార్తలు షికారు చేస్తున్నాయి.