నంది పై మోహన్ బాబు ఫైర్
posted on Sep 15, 2012 @ 5:37PM
తెలుగు సినిమాకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చే నంది అవార్డులపై సినీ నటుడు మోహన్ బాబు మండిపడ్డాడు. దేశం గర్వించదగ్గ మహా నటుడు ఎన్టీ రామారావు గారికి నంది అవార్డు రాలేదని, తనకు కూడా నంది అవార్డు రాలేదని చెప్పారు. పైరవీలు చేసుకుంటూనే నంది అవార్డులు వస్తాయని ఆయన అన్నారు. నంది అవార్డుల వెనుక రాజకీయాలు దాగి ఉన్నాయని, రాజకీయాల వల్లే తనకూ నంది అవార్డు రాలేదని చెప్పారు. నంది అవార్డులు రావాలంటే వెనక వేరే కారణాలు ఉండాలని ఆయన అన్నారు.