త్వరలో తెలంగాణాపై నిర్ణయం: సీఎం కిరణ్
posted on Sep 15, 2012 @ 4:39PM
ప్రత్యేక తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని, యాభై ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం జరుగుతోందని, ఈ అంశంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు అర్ధం చేసుకున్నామని, ఉద్యమాన్ని గౌరవిస్తున్నామని, ఆందోళనలు చేయవద్దని అన్నారు. చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని అన్నారు. చేనేత వృత్తిలో సమస్యలను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. అప్పులకు భయపడి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు.