ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు మృతి
posted on Sep 16, 2012 @ 11:37AM
ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు ఈరోజు ఉదయం 3.30గంటలకు ఆయన ఇంట్లో గుండెపోటుతో మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో ఈ సాయంత్రం నిర్వహిస్తారు. ఆయన మృతికి పలువురు తెలుగు, తమళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సుత్తివేలు తొలి చిత్రం ముద్దమందారం, ఆయన 250కి పైగా సినిమాలలో నటించారు. ఆయన నటించిన వందేమాతరం చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు లభించింది.