చిరంజీవి ఫ్యాన్స్ రచ్చ రచ్చ
posted on Sep 15, 2012 @ 6:39PM
ఏలూరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో చిరంజీవి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. సమావేశం జరిగిన వేదికపై చిరంజీవి ఫ్లేక్సీ లేకపోవడంపై వారు గొడవ చేశారు. కన్నా లక్ష్మినారాయణ ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ కార్యకర్తల సమావేశంలో స్టేజిపై చిరంజీవి ఫోటో పెట్టలేదని చిరంజీవి ఫ్యాన్స్ సమావేశాన్ని అడ్డుకున్నారు. కన్నా లక్ష్మినారాయణ సర్దిచెప్పే ప్రయత్నం చేసిన వారు వినలేదు, ఈ సమయంలో కోటగిరి విద్యాధర రావు జోక్యం చేసుకుని చిరంజీవి అంటే మీకు ఎంత అభిమానం ఉందో మాకూ అంతే అభిమానం ఉందని కాంగ్రెసులో చిరంజీవిని గుర్తించే రోజు వస్తుందని అన్నారు. చిరంజీవి మీద అభిమానం ఉంటే గొడవ చేయడం మానుకోవాలని చెప్పారు. ఆయన సరే వారు వినక పోవడంతో చిరంజీవి బొమ్మ తీసుకుని వచ్చి వేదికపై పెట్టారు. దీంతో చిరంజీవి అభిమానులు శాంతించారు.