టిడిపికిప్పుడు బంద్ పేరు చెబితే పండగే!
posted on Sep 17, 2012 @ 11:44AM
దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎఫ్‌డిఐ అనుమతుల’ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎన్‌డిఎ కూటమి సెప్టెంబర్ 20న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆరోజున దేశ వ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు ... పికెటింగులు నిర్వహించాలని తీర్మానించింది. పేదప్రజలపై భారం మోపే ఈ ‘ప్రజావ్యతిరేక’ విధానాలను ఎండగట్టాలని ఎన్‌డిఎ భాగ స్వామ్య పక్షాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో దొరికిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు తెలుగుదేశం అధినేత ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాలనూ, నిత్యవసరవస్తువుల పెరుగుదలనూ, ప్రభుత్వాస్పత్రుల్లో శిశుమరణాలతో బాటు ఫీజురీఎంబర్స్‌మెంట్స్ అంశాలను ప్రజల్లోకి మరింతగా ప్రచారం చెయ్యాలని నిర్ణయించినట్లు దేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లాల వారీగా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లుగా కూడా వారు చెబ్తున్నారు.