సెమీఫైనల్లో సింధు ఓటమి
posted on Sep 15, 2012 @ 4:18PM
హైదరాబాదీ షట్లర్ సింధూ చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్‌లో పోరాడి ఓడిపోయింది. సెమీస్‌లో చైనా షట్లర్ జియాంగ్ చేతిలో 10-21, 21-14, 19-21 తేడాతో జియాంగ్ చేతిలో పరాజయమ౦ పాలైంది. క్వార్టర్ ఫైనల్లో ఒలింపిక్స్ ఛాంపియన్ లీ జురూయ్‌ని చిత్తు చేసి మహిళా సింగిల్స్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ రెండో సీడ్ జురూయ్‌ని సింధు 21-19, 9-21, 21 -16 స్కోరుతో ఓడించింది. ప్రపంచ నెంబర్ 24 సింధు ఒక్కర్తె ఈ టోర్నీలో భారతదేశం నుంచి పాల్గొంది.