తాగి పోలీసులకు దొరికిన మంత్రి కొడుకు
posted on Sep 15, 2012 @ 3:25PM
మందు తగిన తరువాత కారు నడుపుతూ మంత్రి విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి కెబిఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయాడు. కృష్ణారెడ్డి పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. అతనికి పోలీసుల 2500 రూపాయల ఫైన్ వేసి, మంగళవారం కోర్టుకు హాజరు కావాలని చెప్పారు. తమకు వ్యక్తిగతంగా ఎవరిపై కక్ష లేదని, మందు కొట్టి ఎవరు డ్రైవింగ్ చేసిన ఊరుకునేది లేదనిపోలీసు ఉన్నతాధికారి సివి ఆనంద్ చెప్పారు.