సర్ప్రైజ్ చేసిన ఖుషీ..కన్నీళ్లు పెట్టుకున్న వేద
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. బెంగళూరు పద్మ, మిన్ను నైనిక, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, జీడిగుంట శ్రీధర్ ప్రధాన పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. గత కొన్ని వారాలుగా ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు కుటుంబాల ఫ్యామిలీ మెంబర్స్ యష్, డాక్టర్ వేదల ఎంగేజ్మెంట్ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు.