English | Telugu
రమ్య పేరుతో ఫేక్ కాల్స్.. అలర్ట్ చేసిన సింగర్!
Updated : Feb 8, 2022
ఒక పాపులర్ సింగర్ పేరుతో ఫేక్ కాల్స్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఒకరి మోసం వెల్లడైంది. 'బాహుబలి'లో 'ధీవరా' సాంగ్‌తో సూపర్ పాపులర్ అయిన సింగర్ రమ్య బెహరా పేరుతో ఒకరు ఫేక్ కాల్స్ చేస్తున్నారు. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో, వెంటనే తన అభిమానులను అలర్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ నంబర్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన ఆమె, ఆ నంబర్ తనది కాదని స్పష్టం చేసింది. Also read:అర్జున్ నాకు ఫుడ్ పంపేవారు!
"ఈ వ్యక్తి నా పేరు చెప్పుకుంటూ, అందరికీ కాల్స్ చేస్తోంది. దయచేసి, ఈ నంబర్‌కు రిప్లై ఇవ్వవద్దు, వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చెయ్యండి" అని ఆమె అందులో రాసుకొచ్చింది. ఇప్పటివరకూ 600కు పైగా సాంగ్స్ పాడి సంగీత ప్రియులను అలరించింది రమ్య. ఇటీవల 'పెళ్లిసందD' మూవీలో టైటిల్ సాంగ్, 'గంధర్వలోకాల' పాటలను పాడిన ఆమె చిరంజీవి 'ఆచార్య' సినిమాలో 'నీలాంబరి' పాటను ఆలపించింది. 'క్రాక్'లో పాపులర్ సాంగ్ 'కోరమీసం పోలీసోడా'ను ఆలపించింది కూడా ఆమే. Also read:మరో ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే!?