English | Telugu
చేతికి చిక్కిన వశిష్టకు చుక్కలు చూపిస్తున్న జెండే
Updated : Feb 11, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. థ్రిల్లింగ్ అంశాలతో క్షణక్షణం ఉత్కంఠ తో ఈ సీరియల్ సాగుతోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సీరియల్ మంచి ఛాయిస్ గా మారింది. గత జన్మ ప్రతీకారం అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ ని రూపొందించారు. గత కొన్ని వారాలుగా ఆసక్తికర మలుపులు.. ట్విస్ట్ లతో సాగుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. శుక్రవారం ఎపిసోడ్ మరింత కీలక మలుపులు తిరగబోతోంది.
రాగసుధ తన తల్లిదండ్రుల వద్దే వుందని ఎస్సై ద్వారా తెలుసుకున్న అను.. ఆర్యతో తనకు చిన్న పని వుందని చెప్పి అక్కడికి చేరుకుంటుంది. రాగసుధ గత జన్మలో నత చెల్లెలని చెప్పి తల్లిదండ్రులకు షాకిస్తుంది. ఆ తరువాత తను గతంలో పరిచయం అని చెప్పి కవర్ చేస్తుంది. కట్ చేస్తే..చేతికి చిక్కిన వశిష్టకు జెండే చుక్కలు చూపిస్తుంటాడు. రాగసుధ ఎక్కడికి వెళ్లింది? ఎవరి దగ్గర వుందో చెప్పమని చిత్ర హింసలు పెడుతూ నరకం అంటే ఎలా వుంటుందో చూపిస్తుంటాడు. కట్ చేస్తే.. జెండే, వశిష్ట ఎక్కడా కనిపించడం లేదని నీరజ్ తల్లిని అడుగుతాడు. నైస్ గా సమాధానం చెప్పి కవర్ చేస్తుంది.
Also Read:త్వరలో పెళ్లిపీటలెక్కనున్న హీరో హీరోయిన్లు!
కట్ చేస్తే .. రాగసుధ కోసం ఎదురుచూస్తున్న అను ఎంతకీ తను రాకపోయే సరికి తండ్రి సుబ్బు పై అరుస్తుంది. ఇంకా రాలేదేంటీ? అని కంగారుపడుతుంది. ఇంతలో ఆర్య ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోదాం అంటాడు. టెన్షన్ లో వున్న అను ఇంకా తనని కలవలేదని చెబుతుంది. ఎవరని ఆర్య అడగడంతో ఫ్రెండ్ అని కవర్ చేస్తుంది. అను తల్లిదండ్రులకు ఏం జరుగుతుందో అర్థం కాదు.. ఇంటికి వెళ్లే సరికి రాగసుధ ఇంట్లో వుంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? అనుతో రాగసుధ మాట్లాడిందా? .. అసలు ఏం జరగబోతోంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.