వేద తల్లి కారణంగా అడ్డంగా బుక్కైన యశోధర్
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న ధారావాహిక `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్, మిన్ను నైనిక, బెంగళూరు పద్మ, ఆనంద్, శ్రీధర్ జీడిగుంట ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గత కొన్ని వారాలుగా `స్టార్ మా` లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బిజినెస్ మెన్ అభిమన్యు - మాళవిక (యశోధర్ మాజీ భార్య) కారణంగా చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్న ఈ సీరియల్ బుధవారం మరింత ఆసక్తికర సంఘటనలతో ట్విస్ట్ ఇవ్వబోతోంది.