`జబర్దస్త్` నుంచి వలసలు మొదలయ్యాయా?
బుల్లితెర కామెడీ షో `జబర్దస్త్`. దీనికి కొనసాగింపుగా `ఎక్స్ట్రా జబర్దస్త్` షోని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ షోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, శాంతి స్వరూప్ వంటి వారు స్కిట్ లు చేస్తూ నవ్విస్తున్నారు. ఈ షోతో వీరంతా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే ఇందులో స్కిట్ లు చేసిన మిగతా వారంతా పోయి కొత్త వారు ఎంటరయ్యారు. ఇమ్మానుయేల్, వర్ష వంటి వారు కొత్తగా వచ్చి చేరడంతో పాత వారికి పనిలేకుండా పోయింది.