English | Telugu
రాగసుధకు అను గత జన్మ రహస్యం చెప్పేస్తుందా?
Updated : Feb 11, 2022
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్, వర్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరాఠీ సీరియల్ `తులా ఫఠేరే` ఆధారంగా ఈ సీరియల్ ని రూపొందించారు. ఎనిమిది భాషల్లో ప్రస్తుతం ఈ సీరియల్ రీమేక్ అయింది. ఇందులోని ఇతర ప్రధాన పాత్రల్లో బెంగళూరు పద్మ, జయలలిత, రామ్‌జగన్, విశ్వమోహన్, అనూషా సంతోష్ నటించారు.
థ్రిల్లర్ అంశాలతో గత కొన్ని వారాలుగా బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ గత వారం రోజులుగా చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూ ఆసక్తికర సన్నివేశాలతో సాగుతోంది. అనుని పక్కదారి పట్టించడం కోసం గెస్ట్ హౌస్ లో ఫస్ట్ నైట్ అంటూ ఎరేంజ్ చేస్తాడు ఆర్య. ఇదే క్రమంలో అను వీపుపై స్కెచ్ పెన్ తో ఐ లవ్ యూ అని రాసి తను రాసింది కళ్లతో కాకుండా మనసుతో చూసి చెప్పమంటాడు. చాలా సేపు ఆలోచించిన అను ఆ తరువాత ప్రశాంతంగా కళ్లు మూసుకుని ఆర్య ఏం రాశాడో చెప్పేస్తుంది.
ఆర్య పడుకోగానే అను తన తండ్రి సుబ్బుకు ఫోన్ చేసి రాగసుధ గురించి అడుగుతుంది. తను ఇంటికి వచ్చేసిందని చెప్పడంతో తనకు ఫోన్ ఇవ్వమంటుంది. నా జీవితంలో ఒక సమస్యకు సమాధానం నువ్వు` అని రాగసుధతో అంటుంది. కానీ అను ఏమంటుందో రాగసుధకు అర్థం కాదు. మనది విడదీయ రాని బంధం అని చెబుతుంది అను. ఇంతకీ నీ జీవితానికి నేను అర్థం ఏంటని రాగసుధ మరోసారి అనుని అడుగుతుంది. ఆ విషయం రేపు ఇంటికి వచ్చి చెబుతానని ఫోన్ కట్ చేస్తుంది అను.. శనివారం ఎపిసోడ్ లో రాగసుధకు అను గత జన్మ రహస్యం చెప్పేస్తుందా? ..అలా చెప్పిన మాటల్ని రాగసుధ నమ్మేస్తుందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.