English | Telugu

బిగ్‌బాస్ ఓటీటీ ప్రియుల‌కు బిగ్ షాక్‌

బుల్లితెర‌పై బిగ్‌బాస్ సీజ‌న్ 5 చేసిన హంగామా అంతా ఇంతా కాదు... ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, సిరి హ‌న్మంత్ హ‌గ్గులు.. హ‌ద్దులు దాటిన‌ ప్రియ - స‌న్నిల‌ మాట‌ల యుద్ధం.. యాంక‌ర్ ర‌వి స‌డ‌న్ ఎలిమినేష‌న్‌.. వెర‌సి బిగ్‌బాస్ వార్త‌ల్లో నిలిచింది. గ‌తంతో పోలిస్తే ఈ సీజ‌న్ పై వ‌చ్చిన‌న్ని విమ‌ర్శ‌లు మ‌రో సీజ‌న్ పై రాలేదు. చివ‌రికి హోస్ట్ నాగార్జున‌పై కూడా నెట్టింట దారుణంగా ట్రోలింగ్ జ‌రిగింది. ఓ జంట బ్రేక‌ప్ కి కూడా కార‌ణంగా నిలిచి బిగ్‌బాస్ సంచ‌ల‌నంగా మారింది. ఇదిలా వుంటే 24 గంట‌ల స్ట్రీమింగ్ అంటూ ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ వెర్ష‌న్  మొద‌లైన విష‌యం తెలిసిందే.

య‌ష్ - వేద‌ల పెళ్లిని ఆప‌డానికి అభిమ‌న్యు - మాళ‌విక ఏం చేశారు?

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా అల‌రిస్తున్న ఈ సీరియ‌ల్ గురువారం ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిర‌గ‌బోతోంది. ఈ రోజు హైలెట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. వేద వేసుకున్న మేక‌ప్‌, డ్రెస్సింగ్ చూసి ఖుషీ కోస‌మే పెళ్లి అన్నావ్‌.. ఇప్పుడు ఇలా రెడీ అవుతున్నావ్ అంటూ య‌శోధ‌ర్ కామెంట్ చేస్తాడు. ఆట‌ప‌ట్టించ‌డం కోసం మాలిని కూల్ డ్రింక్‌ లో మందు క‌లిపి వేద ఫ్యామిలీని తాగ‌మంటుంది. వేద త‌ల్లి సులోచ‌న అందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో తాను హ‌ర్ట్ అయ్యాన‌ని డ్రామా మొద‌లుపెడుతుంది మాలిని. దాంతో వేద ఫ్యామిలీ తాగాల్సి వ‌స్తుంది.