English | Telugu

అనుకు రాగ‌సుధ ఆచూకీ తెలిసిపోయిందా?

గ‌త‌కొన్ని వారాలుగా బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. `బొమ్మ‌రిల్లు` ఫేమ్ వెంక‌ట్ శ్రీ‌రామ్, వ‌ర్ష హెచ్ కె ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. రామ్ చ‌గ‌న్‌, విశ్శ‌మోహ‌న్‌, అనూషా సంతోష్‌, బోంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత ఇత‌ర కీల‌క పాత్రల్లో న‌టించారు. ల‌లిత్ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సీరియ‌ల్ గ‌త త‌ను ప్రేమించిన వ్యక్తిని తిరిగి పొంద‌డం కోసం మ‌రో జ‌న్మ ఎత్తిన ఓ యువ‌తి క‌థ‌గా ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. మిస్టీరియస్ క‌థాంశంతో థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటోంది.

రాగ‌సుధ‌ని ఎలాగైనా చంపించాల‌ని ఆర్య‌వ‌ర్ధ‌న్ ప్లాన్ చేస్తాడు. ఇందుకు జెండేని పుర‌మాయిస్తాడు. జెండే ప్ర‌త్యేక బృందంతో క‌లిసి రాగ‌సుధ‌ని వెత‌క‌డం మొద‌లుపెడ‌తారు. ఈ విష‌యాల‌న్నీ అనుకు తెలియ‌కూడద‌ని ఆర్య‌వ‌ర్థ‌న్ త‌న‌ని గెస్ట్ హౌస్ కి తీసుకెళ‌తాడు.. కానీ అత‌నికే తెలియ‌కుండా అను పోలీస్టేష‌న్ కి వెళ్లి రాగ‌సుధ గురించి వెతికి పెట్ట‌మ‌ని కంప్లైంట్ ఇస్తుంది. అక్క‌డే రాగ‌సుధ కార‌ణంగా స‌స్పెండ్ అయిన ఓ ఎస్సై.. అనుకు ప‌రిచ‌యం అవుతాడు.

Also Read:నోయ‌ల్‌కు 'సంపుత‌రా' అని వార్నింగ్ ఇచ్చిన భానుశ్రీ‌! ఎందుకో తెలుసా?

తాను రాగ‌సుధ‌ని చూశాన‌ని, ఓ టిఫిన్ సెంట‌ర్ వ‌ద్ద వుంద‌ని మ‌రోసారి క్లారిఫై చేసుకున్నాకే మీకు ఫోన్ చేస్తాన‌ని చెప్పి అను నంబ‌ర్ తీసుకుని వెళ్లిపోతాడు. క‌ట్ చేస్తే రాగ‌సుధ .. అను త‌ల్లిదండ్రుల వ‌ద్దే వుంటుంది. టిఫిన్ సెంట‌ర్ వ‌ద్ద అను త‌ల్లిదండ్రులు ప‌నులు చేస్తుండ‌గా అక్క‌డికి చేరుకున్న ఎస్సై ... రాగ‌సుధ గురించి అరా తీయ‌డం మొద‌లుపెడ‌తాడు.. అను చెప్పిన అమ్మాయే రాగ‌సుధ అని నిర్ణ‌యానికి వ‌చ్చాక అనుకు ఫోన్ చేసి విష‌యం చెబుతాడు. ఇంత‌కీ రాగ‌సుధ ముందు అనుకు దొరికిందా? .. లేక జెండే బృందానికి క‌నిపించిందా? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.