English | Telugu
'బిగ్ బాస్' ఫేమ్ 'సరయు' అరెస్ట్!
Updated : Feb 8, 2022
యూట్యూబ్ లో బోల్డ్ కంటెంట్, బోల్డ్ డైలాగ్స్ తో యూట్యూబర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది 'సరయు'. అదే ఆమెని బిగ్ బాస్-5 కి వెళ్లేలా చేసింది. అయితే ఊహించని విధంగా మొదటి వారమే ఎలిమినేట్ అయిన సరయు.. తాజాగా ఒక యూట్యూబ్ వీడియో విషయంలో అరెస్ట్ అయ్యి వార్తల్లో నిలిచింది.
గతేడాది సరయు ఫ్రెండ్స్ కొందరు సిరిసిల్లలో 7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ రెస్టారెంట్ ప్రమోషన్ కోసం అప్పట్లో సరయు & టీమ్ చేసిన వీడియో వివాదాస్పదమైంది. తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు కట్టుకొని బూతులు మాట్లాడటం, మద్యం సేవించడం, భజరంగ్ దళ్ ని పరోక్షంగా విమర్శించడం వంటివి ఆ వీడియోలో ఉన్నాయి. దీంతో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు హైదరాబాద్ బంజారాహిల్స్‌కి బదిలీ కావడంతో.. 153A, 295A సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రాత్రి సరయు & టీమ్ ని అదుపులోకి తీసుకున్నారు. సుమారు గంటన్నరకు పైగా వారిని ప్రశ్నించినట్లు సమాచారం.
ఇప్పుడు సరయు కేసు అంశం బిగ్ బాస్ కి తలనొప్పిగా మారే అవకాశముంది. ఎందుకంటే ఓంకార్ హోస్ట్ గా త్వరలో ప్రారంభం కానున్న ఓటీటీ బిగ్ బాస్ లో సరయు కూడా ఓ కంటెస్టంట్ అని తెలుస్తోంది. ఒకవేళ ఈ కేసు వ్యవహారం ముదిరితే ఆమె ఓటీటీ బిగ్ బాస్ లో పాల్గొనడం కష్టమే అంటున్నారు.