English | Telugu
ఆర్యవర్థన్ ఇంట్లో జండేకి చిక్కిన రాగసుధ
Updated : Feb 5, 2022
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. బొఓమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్, వర్ష ప్రధాన పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, జయలలిత, రామ్ జగన్, జ్యోతిరెడ్డి కీలక పాత్రలలో నటించిన ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికర మలుపులతో సాగుతోంది. గత జన్మ ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన ఈ సీరియల్ శనివారం రసవత్తర మలుపులతో సాగబోతోంది. ఆర్య వర్థన్ ని హత్య చేయాలని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది రాగసుధ. ఆర్య కోసం గదులన్నీ వెతుకుతూ వుంటుంది. కట్ చేస్తే ...
ఆర్య వర్థన్, అను కారులో బయటికి వెళ్లిపోతారు. అనుతో కామెడీ చేస్తూ ఆర్య అను కిడ్నాప్ అంటూ గెస్ట్ హౌస్ కి తీసుకెళతాడు. కానీ అను మాత్ం చాలా ఇబ్బందికరంగా ఫీలవుతుంది. అది గమనించిన ఆర్య ఒకసారి లోపతికి వెళదాం.. నచ్చకపోతే తిరిగి ఇంటికి వెళ్లిపోదాం.. అంటాడు.. సరే అని అను .. ఆర్యతో కలిసి లోనికి ఎంట్రీ ఇస్తుంది. అక్కడ లవ్ సింబల్స్ ఆకారంలో వున్న బెలూన్స్ అంతా డెకరేట్ చేసి అందంగా కనిపిస్తుంటాయి. అది చూసిన అను ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అవుతుంది. వాటెంటైన్స్ డే వీక్ మొత్తం ఇక్కడే గడపాలంటాడు ఆర్య...
Also Read:అనుని కిడ్నాప్ చేసిన ఆర్యవర్ధన్!
కట్ చేస్తే... ఆర్య వర్థన్ ఇంట్లో తిరుగుతున్న రాగసుధ అనూహ్యంగా జెండేకు చిక్కుతుంది. రాగసుధ చేతికి చిక్కగానే ఆమె తలపై గన్ను పెట్టి జెండే .. ఆర్యవర్థన్‌కి వీడియో కాల్ చేస్తాడు.. లేట్ చేయకు వెంటనే కాల్చేయ్ .. అంటాడు ఆర్య.. అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలో అను ఆర్య దగ్గరికి వస్తుంది. అయితే తాను ఇదంతా గమనించిందేయోనని ఆర్య భయపడుతుంటాడు.. ఆ తరువాత ఏం జరిగింది? రాగసుధని జెండే చంపేశాడా?.. ఆర్య వర్థన్ అసలు రంగు అనుకి తెలిసిపోయిందా? అన‌్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.