English | Telugu
యశోధర్ - వేదల ఎంగేజ్‌మెంట్ ఆగుతుందా?
Updated : Feb 11, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. కీలక పాత్రల్లో బెంగళూరు పద్మ, ఆనంద్, జీడిగుంట శ్రీధర్ తదితరులు నటించారు. గత కొన్ని వారాలుగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ విజయవంతంగా ప్రసారం అవుతోంది. యశోధర్ - వేదల నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. అందంగా ముస్తాబైన వేద స్టేజ్ పైకి వచ్చేస్తుంది. పురోహితులు మంత్రాలు చదవడం కూడా అయిపోతుంది. కానీ యశోధర్ మాత్రం రాకపోవడంతో నానా రకాలుగా వచ్చిన అతిథులు మాట్లాడుకోవడం మొదలవుతుంది.
వేద కూడా యశోధర్‌ని అనుమానించడం మొదలు పెడుతుంది. ఇదంతా గమనించిన వేద తల్లి సులోచన .. యష్ తల్లి మాలినిపై కోపంతో అరుస్తుంది. మీ వల్లే మా కుటుంబం పరువుపోయిందని, నమ్మించి ఇంత దాకా తీసుకొచ్చి నా బిడ్డని మోసం చేశారంటూ మాలిని కుటుంబంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే ఎక్కడో పొరపాటు జరిగిందని, యష్ అలాంటి వాడు కాదని మాలిని, రత్నం సర్దిచెబుతుంటారు. మరో వైపు `మిస్టర్ యశోధర్ నువ్వు ఇంత కసాయివాడివి అని అనుకోలేదని కోపంగా స్టేజ్ పై నుంచి దిగి యశోధర్ ఆఫీస్ కి వెళతానంటూ బయలుదేరుతుంది..
వేద బావ ఆవేశం వద్దు ఆలోచనతో నిర్ణయాలు తీసుకోమంటాడు. బలమైన కారణం లేనిదే ఇలా జరిగి వుండదని, యష్ ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావంటాడు. కట్ చేస్తే వేద పెళ్లి ఎవరితో జరగబోతోందా? అని ఆరా తీయడానికి వచ్చిన మాళవిక వేదతో తన బావ చనువుగా వుండటాన్ని చూసి తనే వేదని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అని భ్రమపడుతుంది. కట్ చేస్తే.. యష్ తన కూతురు ఖుషీ కోసం అభిమన్యు ఇంటికి వెళతాడు.. అక్కడ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఖుషీ కోసం చివరికి యష్ ... అభిమన్యు కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు.. కానీ ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి బాధపడుతూ మండపానికి చేరుకుంటాడు. యష్ ని చూసి రగిలిపోయిన వేద ఏం చేసింది? .. ఇద్దరి మధ్య పెరిగిన దూరం ఎలా తగ్గింది?.. ఇంతకీ యష్, వేదల ఎంగేజ్‌మెంట్ జరిగిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.