English | Telugu

సెట్లో టీవీ న‌టుడికి దారుణ అవ‌మానాలు

బుల్లితెర‌పై తొలి హీరోగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు మేకా రామ‌కృష్ణ‌. `రుతురాగాలు`, `అమ్మ‌మ్మ‌.కామ్‌` వంటి సీరియ‌ల్స్ లో అద్భుతంగా న‌టించి  మంచి గుర్తింపుని పొందారు. దాదాపు వంద‌కు పైగా సీరియ‌ల్స్ లో న‌టించిన ఆయ‌న బాహుబ‌లి, సైరా చిత్రాల్లో మెరిసిన విష‌యం చాలా మందికి తెలియ‌దు. `బాహుబ‌లి`లో అనుష్క పోషించిన దేవ‌సేన పాత్ర‌కు సోద‌రుడిగా, కుంత‌ల దేశపు రాజుగా క‌నిపించారాయ‌న‌. అలాంటి ఆయ‌న‌కు సెట్ లో జ‌రిగిన అవ‌మానాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నా త‌మ‌ని ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని వాపోయారు.