English | Telugu

స‌ర‌యుపై దాడి చేసిన వ‌ర్మ హీరోయిన్‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో ఇటీవ‌ల మొద‌లైన విష‌యం తెలిసిందే. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రియాలిటీ షో.. బిగ్‌బాస్ టెలివిజ‌న్ షోని మించి ప‌రాకాష్ట‌కు చేరిన‌ట్టుగా క‌నిపిస్తోంది. టెలివిజ‌న్ ఎపిసోడ్ కి మించి కంటెస్టెంట్ లు విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌టం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. కులాల ర‌చ్చ‌.. ఒక‌రిని ఒక‌రు కొట్టుకోవ‌డం.. చెప్ప‌డానికి వీలు కాని భాష‌లో తిట్టుకోవ‌డం వంటివి చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్ తో ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

న‌ట‌రాజ్ మాస్ట‌ర్ తాట తీసిన బిందుమాధ‌వి

ఓటీటీ వెర్ష‌న్ బిగ్‌బాస్ నాన్ స్టాప్ గ‌త నెల 26న మొద‌లైన విష‌యం తెలిసిందే. ముమైత్ ఖాన్ రూపంలో ఫ‌స్ట్ వికెట్ ప‌డిపోయింది కూడా. గేమ్ లో కులా ర‌చ్చ కూడా మొద‌లైంది. దీంతో హౌస్ ఒక్క‌సారిగా హీటెక్కింది. యాంక‌ర్ స్ర‌వంతి హ‌ద్దులు దాటి మాట్లాడుతున్న తీరు స‌రికొత్త వివాదానికి దారితీసేలా వుంది. ఇక న‌టి బిందు మాధ‌వి అనూహ్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో పాత‌ కంటెస్టెంట్స్ అఖిల్‌, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, తేజ‌స్వి భ‌య‌ప‌డిపోతున్నారు. అయితే బిందు మాధ‌విని ఢికొట్టే స‌త్తా ఎవ‌రికీ లేక‌పోవ‌డంతో అంతా ఆమెని మాట‌ల‌తో వెన‌క్కి నెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.

అను కోసం మాన్సీ చేస్తున్న కుట్ర ఏంటీ?

బుల్లితెర పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా అల‌రిస్తున్న ఈ సీనియ‌ల్ రోజుకో ములుపు తిరుగుతూ ఆక‌ట్టుకుంటోంది. శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి ఈ సీరియ‌ల్ ని నిర్మించారు. వ‌ర్ష‌, విశ్వ‌మోహ‌న్‌, జ‌య‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, రామ్ జ‌గ‌న్, బెంగ‌ళూరు ప‌ద్మ‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త జ‌న్మ ప్ర‌తీకారం అనే థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్ తో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. పెద్ద‌మ్మ బస్తీ ని లోక‌ల్ ఎమ్మెల్యే క‌బ్జా చేశాడ‌ని తెలిసి అత‌నికి బుద్ధిచెప్ప‌డానికి రెడీ అవుతాడు ఆర్య వ‌ర్థ‌న్ అయితే తిరిగి ఆ బ‌స్తీలో వున్న సొంత ఇంటికే సుబ్బు తిరిగి రావాల‌ని కండీష‌న్ పెడ‌తాడు ఆర్య‌.. అందుకు సుబ్బు అంగీక‌రించ‌డంతో ఆర్య రంగంలోకి దిగి లోక‌ల్ ఎమ్మెల్యేకు బుద్ధి చెబుతాడు.

అభిమ‌న్యు - మాళ‌వికల‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చిన వేద

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా వీక్ష‌కుల‌ని ఈ సీరియ‌ల్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. య‌శోధ‌ర్ - వేద‌ల పెళ్లి ఆగిపోయింద‌న్న ఆనందాన్ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి అభిమ‌న్యు, మాళ‌విక పార్టీ కి వెళ‌తారు. క‌ట్ చేస్తే వేద - య‌ష్ ల పెళ్లి జ‌రిగిపోతుంది. మాళ‌విక మోసం చేస్తోంద‌ని, పెళ్లి ఆపాల‌నే కుట్ర‌లో భాగంగానే ఇలా చేసింద‌ని ఖుషీ చెప్ప‌డంతో వేద రియ‌లైజ్ అయి య‌ష్ ని పెళ్లి చేసుకుంటుంది.  జ‌ర‌గ‌ద‌నుకున్న పెళ్ళి జ‌ర‌గ‌డంతో ఇరు కుటుంబాలు హ్యాపీ మోడ్‌లోకి వెళ్లిపోతారు.