English | Telugu
సర్‌ప్రైజ్ చేసిన ఖుషీ..కన్నీళ్లు పెట్టుకున్న వేద
Updated : Feb 14, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. బెంగళూరు పద్మ, మిన్ను నైనిక, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, జీడిగుంట శ్రీధర్ ప్రధాన పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. గత కొన్ని వారాలుగా ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు కుటుంబాల ఫ్యామిలీ మెంబర్స్ యష్, డాక్టర్ వేదల ఎంగేజ్‌మెంట్ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. సాఫీగా పూర్తి కావడంతో రెండు ఫ్యామిలీలు కలిసి ఆనందంతో సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు.
Also Read:యశోధర్ - వేదల ఎంగేజ్‌మెంట్ ఆగుతుందా?
అయితే ఈ సమయంలో ఖుషీ వుంటే బాగుండేదని యష్, వేద ఫీలవుతుంటారు. వెంటనే వేద .. ఖుషీ కోసం మాళవికకు ఫోన్ చేస్తుంది. ` మా ఇంట్లో చిన్న పార్టీ జరుగుతోంది మీకేం అభ్యంతరం లేకపోతే ఆ పార్టీకి ఖుషీని పంపిస్తావా?` అని అడుగుతుంది.
అందుకు మాళవిక సరే అంటుంది. అయితే ఇదే సమయంలో పక్కనే వున్న అభిమన్యు వేదని ఖుషీకి కేర్ టేకర్‌గా పెట్టుకుందామంటాడు. దాంతో మాళవిక కొంత అసహనానికి లోనవుతుంది. యు ఆర్ టూ మచ్ అభి.. కోర్టులో ఖుషీ కస్టడీ మనకు వచ్చే వరకు వేద అవసరం.. ఆ తరువాత తను ఎవరో మనం ఎవరో అంటుంది.
Also Read:యష్ - వేదల పెళ్లికి లైన్ క్లియర్
కట్ చేస్తే.. వేద, యష్ ఫ్యామిలీలు పంతులిని పిలిచి పెళ్లి ముహూర్తం పెట్టిస్తుంటారు. ఈ సమయంలో కట్న కానుకల గురించి మాట్లాడుకొండి అంటాడు పంతులు. మాకు ఎలాంటి కట్నకానుకలు అవసరం లేదని అంటుంది యష్ తల్లి మాలిని. అయితే మేము ఆ విషయంలో ఎలాంటి లోటు చేయమని వేద తల్లి సులోచన అంటుంది. ఆ వెంటనే వేదని తమ కన్న కూతురిలా చూసుకుంటామని మాలిని.. సులోచనకు మాటిస్తుంది. దీంతో సులోచన ఎమోషనల్ అవుతుంది. కట్ చేస్తే.. వేద దగ్గరికి వెళ్లిన ఖుషీ అమ్మా అని పిలుస్తుంది.. ఆ పిలుపు విని వేద ఎలా రియాక్ట్ అయింది?.. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.