English | Telugu
మనసులో కోరిక బయటపెట్టిన రోజా.. పంచ్ వేసిన హైపర్ ఆది
Updated : Feb 9, 2022
రాజకీయాల్లో యమ బిజీగా వుంటూనే జబర్దస్త్ కామెడీ షోకు కూడా టైమ్ ని కేటాయిస్తూ హల్ చల్ చేస్తున్నారు సీనియర్ నటి రోజా. జబర్దస్త్ కామెడీ షోకు సింగర్ మనోతో కలిసి జడ్జ్ గా వ్యవహరిస్తున్న రోజు తనదైన పంచ్ లతో కంటెస్టెంట్ లని చెడుగుడు ఆడేస్తున్నారు. అయితే అలాంటి రోజాపై కూడా ఒకరు పంచ్ లు వేస్తూ ఆటపట్టిస్తున్నారు. నవ్వులు పూయిస్తున్నారు. అతనే హైపర్ ఆది. హీరోయిన్ గా రోజా ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకున్నారో ఇప్పటికీ అదే స్థాయి పాపులరిటీని మెయింటైన్ చేస్తూ హంగామా చేస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో వున్న టాప్ హీరోలందరి సరసన నటించి ఔరా అనిపించిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే జబర్దస్త్ కామెడీ షోలోనూ ఓ వెలుగు వెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో రోజా.. మహేష్ బాబుపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడున్న హీరోల్లో రోజా ఎక్కువగా ఇష్టపడే హీరో మహేష్ బాబు. తాజా ప్రోమోలో తనపై రోజా కామెంట్ లు చేసింది. ఇదే ప్రోమోలో రోజా హోమ్ టూర్ కు సంబంధించిన వీడియోని చూపించారు.
Also Read:మరో ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే!?
ఈ వీడియోలోనే రోజా .. మహేష్ బాబుపై ఆసక్తికర కామెంట్ లు చేశారు. నగరిలో వున్న ఎమ్మెల్యే రోజా నివాసానికి హైపర్ ఆది అండ్ టీమ్ హోమ్ టూర్ కి వెళ్లారు. హాలులో వున్న వెంకటేశ్వర స్వామి ఫొటో చూసిన హైపర్ ఆది.. "ఆయనని ఏం కోరుకుంటారమ్మా?" అని రోజాని అడిగాడు. కృష్ణగారబ్బాయి మహేష్ బాబు తో కలిసి సినిమా చేయాలని ఉందని తన మనసులోని కోరికని బయటపెట్టింది. వెంటనే హైపర్ ఆది పంచ్ వేశాడు. `కృష్ణ.. రామ అనుకోక ఎందుకండి మనకీ కృష్ణగారి కొడుకు` అని ఆది పంచ్ వేయడంతో రోజా .. ఆదిని ఎడమచేత్తో కుమ్మేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఈ తాజా ఎపిసోడ్ ఈ గురువారం రాత్రి ప్రసారం కానుంది.