English | Telugu
యష్ - వేదల పెళ్లి .. మాళవికకు తెలిసిపోతుందా?
Updated : Feb 9, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరజంన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, మిన్ను నైనిక, ప్రణయ్ హనుమాండ్ల, ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా `స్టార్ మా` ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఖుషీని మాజీ భార్య మాళవిక, ఆమె బాయ్ ఫ్రెండ్ అభిమన్యు నుంచి కాపాడుకోవాలంటే డాక్టర్ వేదని పెళ్లి చేసుకోవడమే ముందున్న ఆప్షన్ అని గ్రహించిన యష్ మొత్తానికి వేదని పెళ్లికి ఒప్పిస్తాడు.
పెళ్లికి యష్, వేదల తల్లిదండ్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో పెళ్లికి సంబంధించిన పనలు మొదలవుతాయి. ముందు పెళ్లి చూపులు పూర్తవుతాయి... బుధవారం ఎంగేజ్‌మెంట్ కోసం ఏర్పాట్లు చేస్తారు. అంతా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తారు. యష్ తల్లి మలబార్ మాలిని.. వేద తల్లిని ఆట పట్టిస్తూ తన ఈగోని శాటిస్‌ఫై చేసుకుంటూ వుంటుంది. కట్ చేస్తే... యష్ మాజీ భార్య మాళవికకు వేద పెళ్లిపై అనుమానాలు మొదలవుతాయి. వేద ఎందుకు తనని కలవడం లేదని, తన పెళ్లి సంగతులు చెప్పడం లేదని మాళవిక అనుమానించడం మొదలుపెడుతుంది.
ఇదే విషయాన్ని తనకు కాబోయే భర్త, యష్ ప్రత్యర్థి అభిమన్యుకు చెబుతుంది. నాకూ అదే అనుమానంగా వుందని, యష్ ఏమైనా వేదని పెళ్లి చేసుకోబోతున్నాడా?.. ఇంత హడావిడిగా పెళ్లి చూపులు.., ఎంగేజ్‌మెంట్.. ఏంటీ? అని అనుమానిస్తుంటారు. వెంటనే మాళవికని ... వేద ఎంగేజ్‌మెంట్ జరుగుతున్న కల్యాణమండపానికి వెళ్లమంటాడు అభిమన్యు.. అక్కడి వెళ్లిన మాళవికు యష్ - వేదల పెళ్లి గురించి తెలిసిపోతుందా? ... ఇంతకీ ఏం జరగబోతోంది? .. అన్నది తెలియాలంటే గురువారం ఎపిసోడ్ చూడాల్సిందే.