English | Telugu

వ‌ర్ష‌ అమ్మాయి కాద‌న్న ఇమ్మాన్యుయేల్‌.. వాకౌట్ చేసిన వ‌ర్ష‌!

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌, శ్రీ‌దేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోల్లో ఎవ‌రు జంట‌గా క‌నిపించినా పాపుల‌ర్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే సుడిగాలి సుధీర్, ర‌ష్మీ గౌత‌మ్.. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల కార‌ణంగా పాపులారిటీని సొంతం చేసుకుని సెల‌బ్రిటీలుగా మారిపోయారు. తాజాగా మ‌రో జంట గ‌త కొంత కాలంగా ఈ షోలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదే వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్ జంట. వీరిద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుద‌ర‌డంతో నిర్వాహ‌కులు వీరిని జంట‌గా ఫిక్స్ చేసి ఆ క్రేజ్ ని వాడుకుంటున్నారు.

అభిమ‌న్యుని అడ్డంగా బుక్ చేసిన ఖుషీ.... య‌ష్‌, వేద హ్యాపీ

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌లబంధం`. గ‌త కొన్ని వారాల క్రిత‌మే మొద‌లైన ఈ సీరియ‌ల్ `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. శుక్ర‌వారం ఎపిసోడ్ లో ఏం జ‌ర‌గ‌బోతోంది? .. క‌థ ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది? అన్న‌ది ఒక సారి చూద్దాం. కోర్టులో నువ్వు ఎవ‌రి ద‌గ్గ‌ర వుండాల‌ని కోరుకుంటున్నావ‌ని జ‌డ్జి అడిగితే ఖుషీ త‌ను మాళ‌విక అమ్మ తో వుంటాన‌ని చెబుతుంది. ఖుషీ నుంచి ఊహించ‌ని స‌మాధానం రావ‌డంతో య‌ష్‌, వేద షాక్ కు గుర‌వుతారు. ఏంటీ ఇలా జ‌రిగింద‌ని మ‌ద‌న ప‌డుతుంటారు. ఖుషీ త‌న‌కు ద‌క్క‌లేద‌ని బాధ‌ప‌డుతూ వుంటుంది వేద‌.  

స‌ర‌యుపై దాడి చేసిన వ‌ర్మ హీరోయిన్‌

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షో ఇటీవ‌ల మొద‌లైన విష‌యం తెలిసిందే. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రియాలిటీ షో.. బిగ్‌బాస్ టెలివిజ‌న్ షోని మించి ప‌రాకాష్ట‌కు చేరిన‌ట్టుగా క‌నిపిస్తోంది. టెలివిజ‌న్ ఎపిసోడ్ కి మించి కంటెస్టెంట్ లు విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌టం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. కులాల ర‌చ్చ‌.. ఒక‌రిని ఒక‌రు కొట్టుకోవ‌డం.. చెప్ప‌డానికి వీలు కాని భాష‌లో తిట్టుకోవ‌డం వంటివి చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ నాన్ స్టాప్ షో కెప్టెన్సీ కంటెండ‌ర్ టాస్క్ తో ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

న‌ట‌రాజ్ మాస్ట‌ర్ తాట తీసిన బిందుమాధ‌వి

ఓటీటీ వెర్ష‌న్ బిగ్‌బాస్ నాన్ స్టాప్ గ‌త నెల 26న మొద‌లైన విష‌యం తెలిసిందే. ముమైత్ ఖాన్ రూపంలో ఫ‌స్ట్ వికెట్ ప‌డిపోయింది కూడా. గేమ్ లో కులా ర‌చ్చ కూడా మొద‌లైంది. దీంతో హౌస్ ఒక్క‌సారిగా హీటెక్కింది. యాంక‌ర్ స్ర‌వంతి హ‌ద్దులు దాటి మాట్లాడుతున్న తీరు స‌రికొత్త వివాదానికి దారితీసేలా వుంది. ఇక న‌టి బిందు మాధ‌వి అనూహ్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో పాత‌ కంటెస్టెంట్స్ అఖిల్‌, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, తేజ‌స్వి భ‌య‌ప‌డిపోతున్నారు. అయితే బిందు మాధ‌విని ఢికొట్టే స‌త్తా ఎవ‌రికీ లేక‌పోవ‌డంతో అంతా ఆమెని మాట‌ల‌తో వెన‌క్కి నెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.