English | Telugu
ఇంద్రుడు ఉగ్రరూపం.. సౌందర్య సీరియస్..
Updated : Apr 18, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొన్నేళ్లుగా విజయవంతంగా సాగుతున్న ఈ ధారావాహిక గత కొన్ని వారాలుగా గతి తప్పింది. ఒక దశలో ఇండియాలోనే టాప్ టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుని రికార్డు సాధించిన ఈ సీరియల్ గత కొన్నివారాలుగా సాగదీత ధోరణితో సాగుతూ వీక్షకులకు విసుగుపుట్టించింది. మలయాళ సీరియల్ `కరుతముత్తు` ఆధారంగా రీమేక్ చేసిన ఈ సీరియల్ గతి తప్పడంతో కీలక పాత్రలని ఎండ్ చేసిన దర్శకుడు ప్రస్తుతం ఇదే కథను కొత్త తరంతో మొదలుపెట్టాడు.
హిమ, శౌర్యల కథగా మళ్లీ రీస్టార్ట్ చేశాడు. మళ్లీ ట్రాక్ లోకి వస్తున్న ఈ సీరియల్ సోమవారం ఎలాంటి మలుపులు తిరగనుందో ఒకసారి చూద్దాం. జ్వాలగా మారిన శౌర్యకు నిరుపమ్ తో పాటు అంతా అధిక ప్రాధాన్యత నివ్వడంతో స్వప్నకు మండిపోతూ వుంటుంది. ఇదే సమయంలో స్వప్నకు, శౌర్యకు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్వప్న.. జ్వాల (శౌర్య) ఆటోకు నిప్పుపెట్టి తన ఆగ్రహాన్ని చూపిస్తుంది.
దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అవుతారు. మండుతున్న ఆటోని చూస్తూ జ్వాల (శౌర్య) కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఉన్న ఒక్క ఆధారం లేకుండా చేసిందని బోరున విలపిస్తుంది. విషయం తెలిసి ఇంద్రుడు ఉగ్రరూపం దాలుస్తాడు. ఎంత పొగరు తన అంతు చూస్తా అని ఊగిపోతాడు. కట్ చేస్తే విషయం తెలుసుకున్నసౌందర్య .. స్వప్న ఇంటికి వెళ్లి అసహనం వ్యక్తం చేస్తుంది. ఒకరి పొట్టమీద కొట్టావు ఆ పాపం ఊరికే పోదు అంటూ స్వప్నకు వార్నింగ్ ఇస్తుంది. కట్ చేస్తే నిరుపమ్, హిమ కలిసి జ్వాలకు కొత్త ఆటోని కొనిస్తారు. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.