English | Telugu

భార్య‌పై చేయెత్తిన అభిమ‌న్యు కు య‌ష్ దిమ్మ‌దిరిగే వార్నింగ్


బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా సాగుతోంది. ఇందులో నిరంజ‌న్‌, డిబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ఆనంద్‌, మిన్ను నైనిక‌, ప్రణ‌య్ హ‌నుమండ్ల తదిత‌రులు న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ఖుషీ త‌న కూతురే అనే విష‌యాన్ని క్లియ‌ర్ చేసి డీఎన్ ఏ టెస్ట్ ద్వారా య‌ష్ క‌ళ్లు తెరిపిస్తుంది వేది.

ఆ విష‌యం ఇంట్లో వాళ్లకి తెలియ‌డంతో ఒక్క‌సారిగా షాక‌వుతారు. ఇదే విష‌యంపై య‌ష్‌ని నిల‌దీస్తారు. నీలోప‌ల ఇంత బాధ‌పెట్టుకుని మాకు క‌నీసం చెప్ప‌లేక‌పోయావ్ అంటారు. ఇదే స‌మ‌యంలో వేద చేసిన ప‌నికి త‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తారు. అభిమ‌న్యు చేసిన కుట్ర‌ని వేద తిప్పికొట్టి నీకు అండ‌గా నిల‌బ‌డింది. మేము ఈరోజు హాయిగా నిద్ర‌పోతున్నామంటే అందుకు కార‌ణం వేద‌. భ‌ర్త ప‌ట్ల ఎంత మ‌ర్యాద‌గా వుంటుందో మా ప‌ట్ల కూడా అంతే మ‌ర్యాద‌గా వుంటూ నీ గౌర‌వాన్ని కాపాడుతోంది. ఇలాంటి భార్య‌ని ఇచ్చి ఆ దేవుడు నీకు గొప్ప మేలు చేశాడంటుంది య‌ష్ త‌ల్లి మాలిని.

క‌ట్ చేస్తే .. త‌న ప్లాన్ పార‌క‌పోవ‌డం, వేద తెలివిగా డీఎన్ ఏ టెస్ట్ చేసింది అభిమ‌న్యు కుట్ర‌ని భ‌గ్నం చేయ‌డంతో ర‌గిలిపోతుంటాడు. ఎలాగైనా య‌ష్ ని దెబ్బ‌కొట్టాల‌ని భావిస్తూ అదే విషయాన్ని మాళ‌విక తో చెబుతుంటాడు. ఇదే స‌మ‌యంలో స‌డ‌న్ ఎంట్రీ ఇస్తుంది వేద‌. ఇలాంటి నీచ‌మైన బ్ర‌తుకు నీకు అవ‌స‌ర‌మా. ఇలాంటి నీచుడితో క‌లిసి వుండ‌టం అవ‌స‌ర‌మా అని మాళ‌విక‌ని నిల‌దీస్తుంది. దీంతో ఆగ్ర‌హించిన అభిమ‌న్యు ఆవేశంతో ఊగిపోతే వేద‌పై చేయిచేసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు.. ఇంత‌లో మ‌ధ్య‌లోకి ఎంట్రీ ఇచ్చిన య‌ష్ .. అభిమ‌న్యు చేయి ప‌ట్టుకుని ప‌క్క‌కు తోసేసి త‌న ధైర్యం వేద అని, త‌న భార్య జోలికి వ‌స్తే పాతేస్తాన‌ని అభిమ‌న్యుకు వార్నింగ్ ఇస్తాడు. క‌ట్ చేస్తే ...వేద త‌ల్లిదండ్రుల వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ జ‌రుగుతుంది. అందులో పొర‌పాటున మందు క‌లిపిన కూల్ డ్రింక్ దాగుతుంది వేద‌. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? వేద‌కు జ‌రిగిన అవ‌మానానికి య‌ష్ ఎలా రియాక్ట్ అయ్యాడు అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...