English | Telugu

 ఫ్యామిలీ స‌పోర్ట్ తో య‌ష్ ని ఓ ఆట ఆడుకున్న వేద‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన జంట‌గా న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, అనంద్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌యవంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ పాప పాత్ర ప్ర‌ధానంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ ప్ర‌తీ వారం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఆద్యంతం అల‌రిస్తోంది. ఈ గురువారం మ‌రింత ఆస‌క్తిగా సాగ‌బోతోంది. వేదఅత్తారింట్లో వుండ‌టంతో ఆమె తండ్రి వేద గురించి ఆలోచిస్తూ బాల్క‌నీలోకి వ‌స్తారు.

 గోవాలో మోనిత చెరుకు ర‌సం

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న టాప్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ దేశ వ్యాప్తంగా టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుంది. మ‌ల‌యాళ సీరియ‌ల్ కు రీమేక్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ద్వారా మ‌ల‌యాళ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్ తెలుగులో వంట‌ల‌క్క‌గా పాపులారిటీని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా స్టార్స్ త‌ర‌హాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. వంట‌ల‌క్క‌కు జోడీగా న‌టించిన ప‌రిటాల‌ నిరుప‌మ్ కూడా స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయాడు. ఇదిలా వుంటే ఈ సీరియ‌ల్ లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు నిరుప‌మ్ ల పాత్ర‌ల‌కు శుభం కార్డు వేసేశాడు ద‌ర్శ‌కుడు.