English | Telugu
పూర్ణ బుగ్గ కొరికిన సుధీర్.. వార్నింగ్ ఇచ్చిన రష్మీ
Updated : Apr 20, 2022
జబర్దస్త్ కామెడీ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా ఇటీవల మంత్రి వర్గం లో చోటు దగ్గరడంతో గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. వెళ్లిపోతున్న సమయంలో రోజా ఎమోషనల్ అయింది కూడా. అయితే ఆమె స్థానంలో ఎవరు వస్తారు? .. ఎలా వుండబోతోంది షో అన్నది గత కొన్ని రోజులుగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతా ఊహించినట్టుగానే ఈ షోలోకి పూర్ణ ఎంట్రీ ఇచ్చేసింది. వచ్చి రాగానే రష్మీ గౌతమ్ కు దిమ్మదిరిగే షాకిచ్చింది. కొత్త జడ్జిగా రోజా స్థానంలో పూర్ణ ఎంట్రీ ఇవ్వడంతో టీమ్ లీడర్లు రెచ్చిపోయారు. ముందు ఇమ్మానుయేల్ ముద్దు అడిగాడు.
స్కిట్ అనంతరం ఇమ్మానుయేల్ చేతిపై పూర్ణ ముద్దు పెట్టేసి కొత్త రచ్చకు తెరలేపింది. ఇమ్మానుయేల్ చేతిపై పూర్ణ ముద్దు పెట్టే సమయంలో వర్ష ఫీలైంది. ముద్దు పెట్టిన వెంటనే పూర్ణ .. ఇమ్మానుయేల్ విగ్గుని తొలగించేసింది. దీంతో వర్ష నవ్వుల్లో మునిగిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సుడిగాలి సుధీర్.. ఓ కొంటె కోరిక కోరాడు. 'గతంలో మీరు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. ఇప్పడు నేను హీరోని కూడా. నాకు మీ బుగ్గ కొరికే అవకాశం ఇవ్వండి' అంటూ ఠక్కున అడిగేశాడు.
వెంటనే `ఏంటీ సుధీర్ మీకు నా బుగ్గ కొరకాలని వుందా?' అంటూ పూర్ణ అడిగింది. దానికి సుధీర్ అవునని సమాధానం చెప్పాడు. వెంటనే 'అయితే రండి' అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది పూర్ణ. తను అలా అన్న వెంటనే సుధీర్ .. పూర్ణ దగ్గర వాలిపోయాడు.. ఇది గమనించిన రష్మీ ఒక్కసారిగా షాక్ అయి పూర్ణకు వార్నింగ్ ఇచ్చింది. "పూర్ణ గారు మీరు ఇలా చేయడానికి వీళ్లేదు. దీనికి నేను ఒప్పుకోను" అంటూనే ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ తరువాత సుధీర్ ని చూసి తల కిందకి దించి ఆవేదన వ్యక్తం చేసింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఏం జరిగిందో తెలియాలంటే శుక్రవారం ఎపిసోడ్ చూడాల్సిందే.