English | Telugu
శివాలెత్తిన శివజ్యోతి.. వదిలే ప్రసక్తిలేదంటూ వార్నింగ్
Updated : Apr 20, 2022
బిగ్ బాస్ సీజన్ 5 లో సందడి చేసిన శివజ్యోతి ఆ తరువాత బుల్లితెరపై బిజీగా మారిపోయింది. వరుస షోలలో పాల్గొంటూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే తాజాగా శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమెకు అంతా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజా వార్తలపై శివజ్యోతి మండిపడింది. తాను ప్రెగ్నెంట్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తనపై యూట్యూబ్ లో తప్పుడు వార్తలని ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తనపై తప్పుడు ప్రచారానికి తెరలేపిన సదరు యూట్యూబ్ ఛానల్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఓ వీడియోని కూడా విడుదల చేసింది.
`మీ అందరికి ఓ ముచ్చట చెప్పాలి. నా గురించి నాకు తెలియని విషయాలు చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకు నాపై ఇలాంటి వార్తలు వస్తున్నాయో తెలియదు. స్టార్టింగ్ లో ఎందుకు లే రియాక్ట్ కావడం అని వదిలేశా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇటీవల ఓ ఈవెంట్ కోసం వెళ్లినప్పుడు మామిడికాయ పట్టుకుని ఓ ఫొటో దిగా. దాన్ని పట్టుకుని ఇంత రచ్చ చేస్తున్నారు.' అని శివాలెత్తింది శివజ్యోతి.
అంతే కాకుండా తను లావు అయ్యానని, 30 ఏళ్లు వచ్చాయి. శరీరంలో మార్పులు వస్తాయి. మీకేంటీ బాధ? దీన్ని పట్టుకుని ప్రెగ్నెంట్ అవుతుంది. తల్లి కాబోతోంది అంటూ టైటిల్స్ పెడుతున్నారు.నా పర్సనల్, ప్రొఫెషనల్ విషయాన్ని లేవనెత్తారు వదిలే ప్రసక్తే లేదు. వ్యూస్ కోసం ఇంత కక్కుర్తిపడతారెందుకు? నాకు పెళ్లై చాన్నాళ్లే అవుతోంది. నా పేరెంట్స్ పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు.
అందరూ ఫోన్ లు చేసి నన్ను అడుగుతున్నారు. మీరు రాసిన రాతల వల్ల నాకు ఈవెంట్లు కూడా రావడం లేదు. ప్రెగ్నెంట్ కదా.. ఆమె చేయదులే అని నాకు పరి ఇవ్వడం లేదు. నా ఫ్రెండ్స్ అందర్నీ ఇందులో ఇన్ వాల్వ్ చేస్తున్నారు. నా జీవితంలో ఇది చాలా పెద్ద విషయం. నా టైం వచ్చినప్పుడు నిజంగా అది జరిగినప్పుడు నేను చెప్తా. నా వ్యక్తిగత విషయాలు నేనే చెప్తా. యూట్యూబ్ ఛానల్ లో నా ఫ్యామిలీ మ్యాటర్ లాగారు కాబట్టి విడిచి పెట్టను. ఇది రిక్వెస్ట్ అనుకుంటావో బెదిరింపు అనుకుంటావో నీ ఇష్టం. నేను ఏది చేయాలో అది చేస్తా.. వినకపోతే మీ కర్మ. ఇక్కడితో వదిలేద్దాం` అని ఓ రకంగా రిక్వెస్ట్ చేసింది శివజ్యోతి.