English | Telugu
లేడీ అర్జున్ రెడ్డి బిందు మళ్లీ రెచ్చిపోయింది
Updated : Apr 18, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఏడవ వారం పూర్తి చేసుకుని ఎనిమిదవ వారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. గత కొన్ని వారాలుగా ఈ సీజన్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. టెలివిజన్ వేదిగా ప్రసారం అయ్యే బిగ్ బాస్ కంటే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ చాలా దారుణంగా వుందని, సభ్యులు హద్దులు మరిచి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇవే కామెంట్ లని హౌస్ నుంచి బయటికి వచ్చి న వారు కూడా చేస్తుండటం గమనార్హం. ఇదిలా వుంటే ఎనిమిదవ వారం నామినేషన్ ల ప్రక్రియ మొదలైంది.
ఇందులో భాగంగా ఇంటి సభ్యులందరూ తగిన కారణాలు చెప్పిన తరువాత వారు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు సభ్యుల ముఖంపై ఫోమ్ ని పూర్తిగా పూయాల్సి వుంటుంది అంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ని అరియానా, అశోక్ లతో మొదలుపెట్టారు. శివ తింటుంటే అతని నోటి నుంచి లాక్కోవడం ఎమోషన్ కాదా? అంటూ అరియానా రచ్చ మొదలుపెట్టింది. ఆ పాయింట్ ని పట్టుకుని నామినేషన్ లోకి వచ్చిన అఖిల్ ... నువ్వు మా ఫుడ్ ని వేస్ట్ చేశావ్ దాంతో మేము చాలా హర్ట్ అయ్యాం.. అంటూ అరియానాని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు అఖిల్.
ఇక వెళ్లిపోయిన స్రవంతిని పాయింట్ చేస్తూ మాట్లాడుతున్నారని అఖిల్ అనడంతో వెంటనే బిందు మాధవి లైన్ లోకి వచ్చేసింది. స్రవంతి గేమ్ కాదా? అంటూ చురకలంటించింది. స్రవంతి గేమ్ లో లేదా?.. మీకు ఊరికే సేవలు చేసుకోవడానికే వచ్చిందా? .. అరియానాని చూపిస్తూ `ఎమోషనల్ గా వాడుతున్నావు కదా.. అంటూ అఖిల్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన అఖిల్ `వాడుతున్నావ్ అంటే పిచ్చిదానిలా ఏం మాటలు మాట్లాడుతున్నావ్ .. ఫస్ట్ నువ్వు గేమ్ ఆడు అని ని ఫ్రెండే చెబుతున్నాడు` అని ఫైరయ్యాడు. బిందు ఊరుకుంటుందా?.. వెంటనే `నీగేమే వెన్నుపోటు పొడిచే గేమ్` అంటూ దిమ్మదిరిగే పంచ్ వేసింది.. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.