English | Telugu
ప్రేమ ఎక్కడైనా పుట్టొచ్చు - అషురెడ్డి
Updated : Apr 22, 2022
బిగ్‌బాస్ ఓటీటీ లో బోల్డ్ గా వ్యవహరిస్తున్న అషురెడ్డి ఏ ఒక్క ఛాన్స్ లభించినా దాన్ని వాడేస్తోంది. ఓటీటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి అఖిల్ బ్యాచ్ తో మింగిల్ అయిపోయిన ఈ యూట్యూబ్ స్టార్ గేమ్ మాత్రం ఆడకండా అఖిల్ సహాయంతో నెట్టుకొచ్చేస్తోంది. ఇటీవల అఖిల్ కారణంగానే సునాయసంగా కెప్టెన్ అనిపించుకున్న అషు రెడ్డి హౌస్ లోకి రావడానికి ముందు ఓ యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తనకు కాబోయే వాడు ఎలా వుండాలి? . తనకు ఎలాంటి క్వాలిటీస్ వుండాలో చెప్పేసింది.
అయితే హౌస్ లో మాత్రం బిగ్ బాస్ .. అఖిల్ కి అషుకి మధ్య దూరం తగ్గించేసి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ మొదలయ్యిందనేలా వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. కానీ పెద్దగా అది వర్కవుట్ అయినట్టుగా కనిపించడం లేదు. ఇదిలా వుంటే బిగ్ బాస్ లో బాయ్ ఫ్రెండ్ ని వెతు్కోవడం కోసమే అడుగుపెట్టానని చెప్పేసింది అషురెడ్డి. అయితే పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని క్లారిటీ ఇచ్చేసింది. తనకు కాబోయే వాడిలో ఫైవ్ క్లాలిటీస్ వుండాలని లిస్ట్ చెప్పింది.
తనకు డ్రైవింగ్ వచ్చి వుండాలంది. అదేంటీ డ్రైవర్ ని పెళ్లాడతావా? అంటూ ఏ డ్రైవర్ ని పెళ్లి చేసుకోకూడదా? .. ప్రేమ ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టొచ్చు అంటూ రివర్స్ కౌంటర్ వేసింది. తాను కోరుకునే క్వాలిటీస్ వున్న అబ్బాయి బిగ్ బాస్ హౌస్ లో పరిచయం అయితే దాన్ని లవ్ గా అంగీకరించను. బయటికి వచ్చాక కూడా తను లవ్ చేస్తే అప్పుడు ఆలోచిస్తా..నాకు నచ్చితే అమ్మకు చెప్పి పెళ్లి చేసుకుంటా` అంటూ షాకిచ్చింది అషురెడ్డి.