English | Telugu
'జబర్దస్త్'లోకి రోజా రీఎంట్రీ ఇచ్చారా?
Updated : Apr 24, 2022
'జబర్దస్త్' కామెడీ షోకు గత కొంత కాలంగా మనోతో కలిసి రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమెకు ఏపీ మంత్రి వర్గంలో చోటు దక్కడంతో `జబర్దస్త్` కామెడీ షోకు గుడ్ బై చెప్పేశారు. చాన్నాళ్లుగా టీమ్ తో కొనసాగుతూ అనుబంధం ఏర్పడటంతో చాలా ఎమోషనల్ అయ్యారు కూడా. అయితే ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ కూడా రోజాను ప్రత్యేకంగా సత్కరించి టీమ్ మెంబర్స్ తో వీడ్కోలు చెప్పించింది.
కట్ చేస్తే.. తాజా ప్రోమోలో రోజా టీమ్ మెంబర్స్ పై పంచ్ లు వేస్తూ నవ్వులు పూయించడం ఇప్పడు పలువురిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తనకు మంత్రి పదవి దక్కడంతో జబర్దస్త్ నుంచి రోజా తప్పుకోవడంతో ఆ స్థానంలోకి ఇంద్రజ వచ్చి చేరింది. కానీ తాజా ప్రోమోలో ఇంద్రజ కనిపించకుండా రోజానే కనిపించడం ఏంటని, రోజా అలా వెళ్లి మళ్లీ రీఎంట్రీ ఇచ్చేసిందా అని ఆరా తీస్తున్నారు. వచ్చే వారం అంటే ఈ నెల 28న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
అయితే కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన ప్రోమోలో మనో తో కలిసి రోజా జబర్దస్త్ షోలో సందడి చేస్తూ కనిపించారు. జడ్జి సీట్ లో రోజా ఎప్పటిలాగే కనిపించి సర్ ప్రైజ్ చేశారు. ఎప్పటి లాగే టీమ్ మెంబర్స్ పై పంచ్ లు వేస్తూ నవ్వులు పూయించారు. రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్ లు చేసిన స్కట్ లపై రోజా పంచ్ లు వేశారు. ఓ దశలో కామెడీ కావాలంటూ రోజా వేసిన పంచ్ లకు టీమ్ మెంబర్స్ బిక్క మొహం వేశారు. అయితే తాజా ప్రోమో రోజా `జబర్దస్త్ ` కి గుడ్ బై చెప్పడానికి ముందు షూట్ చేసిందని, ఇదే చివరి ఎపిసోడ్ అని చెబుతున్నారు. రోజా అదిరపోయే పంచ్ లతో నవ్విస్తున్న తాజా ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.