English | Telugu
బ్యాంకాక్‌లో తల్లీ కూతుళ్ల హంగామా
Updated : Apr 25, 2022
వెండితెరపై సందడి చేసే సురేఖా వాణి తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియా వేదికగా హల్‌చల్ చేస్తుంటారు. సక్షసల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు పెడుతూ సందడి చేస్తుంటారు. బర్త్ డే పార్టీలు.. స్పెషల్ అకేషన్ లక సంబంధించిన వీడియోలు, ఫొటోలతో అభిమానులని అలరిస్తుంటారు. గత రెండేళ్లుగా ఎలాంటి వెకేషన్ లకు వెళ్లని ఈ ఇద్దరు తల్లీ కూతుళ్లు తాజాగా బ్యాంకాక్ కు వెకేషన్ కు వెళ్లారు. కరోనా కారణంగా బయటి దేశాలకు వెళ్లడానికి కాస్త ఇబ్బందపడిన సురేఖా వాణి, సుప్రీత బ్యాంకాక్ కు వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించారు. బ్యాంకాక్ తో పాటు థాయ్ లాండ్ లోనూ సందడి చేయబోతున్నారీ తల్లీ కూతుళ్లు. అక్కడి వీధుల్లో చక్కర్లు కొడుతూ స్పాలో ధాయ్ మసాజ్ చేయించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని సురేఖా వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సందగడి చేస్తున్నాయి. థాయ్ లో సుప్రీత థాయ్ మసాజ్ చేయించుకుంటున్న ఫొటోలని కూడా పోస్ట్ చేయడంతో నెటిజన్ లు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
అంతే కాకుండా ఫ్లైట్ లో తల్లీ కూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మందు గ్లాసులతో చీర్స్ చెబుతూ ఇద్దరూ కనిపించారు. ఆ ఫొటోలని కూడా అభిమానులతో పంచుకున్నారు. రెండేళ్లుగా విదేశాలకు వెళ్లని ఈ తల్లీ కూతుళ్లు ఈ ట్రిప్ ని మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నారట. ఇటీవల గోవాలో సందడి చేసిన తల్లీ కూతుళ్లు ఇప్పడు బ్యాంకాక్, థాయ్ లాండ్ లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుండటం విశేషం. ఇటీవల ఓ ప్రైవేట్ ఆల్బమ్ కు సంబంధించిన సాంగ్ ప్రమోషన్ లో భాగంగా ప్రేమికుడు, పెళ్లి అంటూ పబ్లి సిటీ స్టంట్ చేసి సురేఖా వాణి కూతురు సుప్రతీ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.