English | Telugu
నో ఓటింగ్ .. వెళ్లమంటే వెళ్లిపోవాల్సిందే - మహేష్ విట్టా
Updated : Apr 18, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఎలిమినేషన్ పై చాలా రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీక్షకుల ఓటింగ్ ని పరిగణనలోకి తీసుకోకుండా ఇంటి సభ్యుల్లో నిర్వాహకులకు ఎవరు నచ్చడం లేదో వారిని మాత్రమే ఎలిమినేట్ చేస్తున్నారట. ఇదే విషయాన్ని తాజాగా మహేష్ విట్టా వెల్లడించి షాకిచ్చాడు. అనూహ్యంగా ఏడవ వారం మహేష్ విట్టా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ ఓటీటీ నుంచి బయటికి వచ్చిన మహేష్ విట్టా సంచలనన విషయాల్ని బయటపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎలిమినేషన్ గురించి మాకు ముందే హింట్ ఇచ్చేశారు. ఎవరైనా ఎప్పుడైనా ఎలిమినేట్ కావొచ్చు అని బిగ్ బాస్ టీం వాళ్లు ముందే చెప్పారు. వీకెంట్ ఎలిమినేషన్ తో పాటు మిడ్ వీక్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయని చెప్పారని, వాళ్ల ప్లాన్ లు ఎలా వున్నాయో తెలియడం లేదన్నాడు. బిగ్‌బాస్ టీమ్ ఎవరిని ఉంచాలంటే వాళ్లని ఉంచుతున్నారు. మన చేతుల్లో కానీ, ఓటింగ్ వేసే ప్రేక్షకుల చేతుల్లో కానీ ఏమీ లేదని తేల్చి చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
`నాకు పీఆర్ టీమ్ ఏమీ లేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. షోలోకి వెళ్లే ముందు నా తమ్ముడికి ఫోన్ ఇచ్చి వెళ్లాను. వాడే అంతా చూసుకున్నాడు. పీఆర్ టీమ్ అనేది కొత్తగా వచ్చేవాళ్లకు.. అది నాకు అవసరం లేదు. నేను ఏంటో అందరికి తెలుసు. ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా వున్నాను. కప్పుకొట్టాలి.. కసిగా ఆడి చివరి వరకు ఉండాలి అంటే గేమ్ ఎలాగైనా ఆడొచ్చు. మహేష్ విట్టా రియాలిటీ ఏంటన్నదే చూపించాలని నేను హౌస్ లోకి వెళ్లాను. లాస్ట్ టైమ్ 12 వారాలు వుంటే ఈ సారి ఏడు వారాలే ఎక్కువ అనిపించింది. నేను పాపులర్ కావాలని ఒకరిని బ్యాడ్ చేయాలనుకోలేదు` అని చెప్పుకొచ్చాడు మహేష్ విట్టా.