English | Telugu
యష్ అత్యుత్సాహం.. చెంప పగలగొట్టిన వేద!
Updated : Apr 22, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. గత కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పిలకలలు పుట్టరని పెళ్లికి దూరమైన ఓ యువతి.. తల్లి దూరమైన ఓ పాప.. ఆ పాప కోసం మరో పిల్లలే పుట్టని యువతిని పెళ్లాడిన యువకుడు.. ఈ ముగ్గురి అనుబంధం నేపథ్యంలో ఈ సీరియల్ ని రూపొందించారు. గత కొన్నివారాలుగా విజయవంగంతా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ తాజాగా కీలక మలుపులు తిరుగుతూ మరింతగా ఆకట్టుకుంటోంది.
నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, అనంద్, ప్రణయ్ హనుమండ్ల, మిన్ను నైనిక కీలక పాత్రల్లో నటించారు. శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. ఆఫీసులో వున్న యష్ .. వేద తండ్రి వరదరాజులుకు ఫోన్ చేసి అత్తయ్య గ్రీటింగ్స్ చెప్పేదాకా చెప్పొద్దని రెచ్చగొట్టేస్తుంటాడు. పక్కనే వున్న వేద ఇదంతా స్పీకర్ ఆన్ చేసి వింటుంది. పక్కకు వెళ్లి యష్ ని నిలదీస్తుంది. వేద లైన్ లోకి వచ్చేసిందని గ్రహించిన యష్ రోమాంటిక్ గా మాట్లాడుతూ వేదని డైవర్ట్ చేయాలని ఫోన్ లోనే కిస్ ఇస్తాడు.
కట్ చేస్తే వేద పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. ఇదే అదనుగా యష్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తాడు. తన మామకు మందు బాటిల్ ని గిఫ్ట్ గా ఇచ్చేసి కూల్ చేసి తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తాడు. థమ్స్ అప్ బాటిల్ లో మందు కలిపి తాగించాలని చూస్తాడు. అదే టైమ్ లో వేరే వాళ్లు రావడంతో ఆ బాటిల్ అక్కడే వుంటుంది. దాహం గా వుందని బాటిల్ కోసం వెతుకుతున్న వేద మందు కలిపిన థమ్స్ అప్ ని తాగేస్తుంది. రచ్చ రచ్చ చేస్తుంది. చివరికి ఇది యష్ చేసిన పని అని తెలియడంతో చెంప ఛెల్లుమనిపిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? యష్ రియాక్షన్ ఏంటీ? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.