English | Telugu
`కార్తీకదీపం`ని క్యాష్ చేసుకునే పనిలో `వంటలక్క`
Updated : Apr 21, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీకదీపం`. గత కొంత కాలంగా టాప్ రేటింగ్ తో కొనసాగి ఈ సీరియల్ వంటలక్క కారణంగా టాప్‌లోకి వెళ్లి పాపులర్ అయింది. అంతే కాకుండా `కార్తీకదీపం` టైటిల్ ఎంత పాపులర్ అయిందో `వంటలక్క` పేరు కూడా అంతే పాపులర్ అయింది. దీంతో ఇదే పేరుని తమ తదుపరి సీరియల్ కి వాడేసుకుంటూ కొత్త సీరియల్ ని ప్రారంభించబోతున్నారు `కార్తీకదీపం` నిర్మాత గుత్తా వెంకటేశ్వరరావు. ఈ సీరియల్ కూడా స్టార్ మా లో ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.
అత్యాశకు మంచి తనానికి మంచితనం అవకాశంగా మారనుందా? అంటూ తాజాగా `వంటలక్క` ప్రోమోని విడుదల చేశారు. ఓ ఇంటికి లైటింగ్ చేసుకునే ఓ యువకుడు అదే ఇంటి యజమాని కూతురిని నమ్మించి బుట్టలో వేస్తాడు.. డబ్బు, ఆస్తీ, హోదా కోసం తన ట్రాప్ లో పడిన ఆ అమ్మాయి ఎలా వంటలక్కగా మారింది?.. లేక వంటలక్కకు, ఈ సీరియల్ కు ఏదైనా సంబంధం వుందా? అన్నది తెలియాలంటే త్వరలో ప్రారంభం కానున్న ఈ సీరియల్ చూడాల్సిందే. అత్యధిక భాగం తమిళ నటులు నటిస్తున్న ఈ సీరియల్ `వంటలక్క` పేరుని ఎంత వరకు నిలబెడుతుందో చూడాలి.
ఈ సీరియల్ ప్రోమోని `కార్తికదీపం` ఫేమ్ శోభాశెట్టి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అమాయకురాలైన వరలక్ష్మీకి.. డబ్బు కోసం లైటింగ్ లు సెట్ చేసే యువకుడికి మధ్య ఎలా ప్రేమ కథ పుట్టింది. అది ఆమె జీవితాన్ని ఏ మలుపు తిప్పింది అన్నది తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. తమిళ నటుడు ధీరవం రాజ్ కుమారన్ హీరోగా, శిరీన్ శ్రీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో తమిళ నటుడు నీళల్ గళ్ రవి తదితరులు కనిపించనున్నారు.