English | Telugu

బిగ్ బాస్ హౌస్ లోకి విరాట్ కోహ్లీ వస్తే...


బిగ్ బాస్ అంటే ఆ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది ఎవరికైనా. ఐతే మనం ఇప్పటి వరకు చిన్న చిన్న నటీనటులను, కామన్ మ్యాన్ ని చూసాం. మొదట్లో కొన్ని సీజన్స్ వరకు బిగ్ బాస్ రసవత్తరంగా ఉండేది..చూసే కొద్దీ చూడబుద్దేసేది. కానీ గత రెండు, మూడు సీజన్స్ నుంచి అసలు ఎందుకొచ్చిందిరా బాబు తలనొప్పి అనిపించేలా ఉంటోంది. ఎందుకంటే అందులో అంతా బూతు తప్ప వేరే ఏమీ ఉండడం లేదు. టాలెంట్ ఇంప్రూవ్ చేసుకునేలా కానీ ఫామిలీ మొత్తం కలిసి చూసేదిలా కానీ లేదంటే పిల్లలకు ఏమన్నా అర్దమయ్యే కాన్సెప్ట్స్ కానీ ఉండడం లేదు.

ఈ షో ఏదో నడుస్తోంది అంటే నడుస్తోంది. ఇక ఇప్పుడు సీజన్ 8 కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. కంటెస్టెంట్స్ ఎవరెవరు అంటూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఐతే ఆడియన్స్ కి వీళ్ళు వస్తే బాగుండు అనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలాంటి టైములో బిగ్ బాస్ లోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటూ కొంతమంది ఆడియన్స్ ని అడిగేసరికి ఒక సీనియర్ సిటిజన్ అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. "బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరు వస్తే బాగుంటుంది..ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు." అనేసరికి "విరాట్ కోహ్లీ గారు ఉంటే బాగుండు అనిపిస్తోంది" అనేసరికి అందరూ షాక్ అయ్యారు. అతని ఆన్సర్ కి నెటిజన్స్ కామెడీ రిప్లైస్ ఇస్తున్నారు. "కోహ్లీ అంబానీ ఇంట్లో పెళ్ళికే వెళ్ళలేదు..ఇంకా బిగ్ బాస్ హౌస్ కా...కానీ ఐడియా చాలా బాగుంది...తాత రాక్డ్. ప్రభాస్ అన్న వస్తే చాలా బాగుంటుంది.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా విరాట్ కోహ్లీ బిగ్ బాస్ కి రావడం అన్న ఊహే భలే క్రేజీగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.