English | Telugu

పచ్చ కోకలో కాకరేపిన రంగమ్మత్త.. ఆ ఫోటోలు వైరల్!


బుల్లితెర యాంకర్లలో గ్లామర్ తో రోజు రోజుకు డోస్ పెంచుతున్న బ్యూటీ అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్తగా చెరగని ముద్ర వేసిన అనసూయ టీవీ యాంకర్ గా కెరీర్‌ ని ప్రారంభించింది.

అనసూయ ఇప్పటికి చాలా సినిమాల్లో నటించినా రంగమ్మత్త అనే క్యారెక్టర్ ని జనాలు ఎక్కువగా గుర్తుంచుకున్నారు. అందుకేనేమో తనేం పోస్ట్ చేసినా సూపర్ అత్త అంటు కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా గ్రీన్ కలర్ చీరలో చేసిన ఓ ఫోటో షూట్ నెట్టింట వైరల్ గా మారింది. తను ' సింబ ' అనే ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. అందుకే ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఈ చీర కట్టుకొని ఫోటోషూట్ చేసి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మొత్తంగా పది ఫోటోలు అప్లోడ్ చేయగా అందులో రెండు, తొమ్మిది ఫోటోలు మరీ బోల్డ్ గా ఉన్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఆ రెండు ఫోటోలే ఎక్కువ కిక్కు ఇస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పచ్చ కోకలో రంగమ్మత్త అంటు అనసూయ పేరే వినిపిస్తుంది. అందంలో ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లకి కూడా గట్టి పోటీ ఇస్తుంది అనసూయ భరద్వాజ్. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. తాజాగా శేఖర్ మాస్టర్ తో కలిసి ఓ షోని చేస్తోంది అనసూయ. ఇన్ స్టాగ్రామ్ లో అనసూయకి 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అనసూయ ఒక్క పోస్ట్ కి లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు, మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. అందుకేనేమో స్పాన్సర్స్ వెతుక్కుంటూ మరీ తన దగ్గరికి వచ్చి ఫోటో షూట్ లు చేపించుకుంటున్నారు.