English | Telugu
Karthika Deepam2 : సూపర్ సస్పెన్స్ గా కోర్ట్ రూమ్ డ్రామా!
Updated : Aug 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -115 లో......సుమిత్ర పూజ చేస్తుంటే శౌర్య తన దగ్గరికి వస్తుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందని అడుగగా.. బయటకు వెళ్ళింది, వస్తుంది. మనం టిఫిన్ చేద్దామని అంటుంది. కోర్ట్ లో ఏం జరుగుతుందో ఏంటో అని సుమిత్ర టెన్షన్ పడుతుంది. మరొకవైపు కోర్ట్ లో జడ్జి ముందు నరసింహా లాయర్ మాట్లాడుతుంటాడు. ఒక తండ్రి తన కూతురు కావాలని కోర్ట్ కి వచ్చాడు.. ఈ కేసు చాలా వింతగా ఉందని అంటాడు. ఆ తర్వాత లాయర్ నరసింహాతో మాట్లాడతాడు. తన బిడ్డను నిర్లక్ష్యం చెయ్యడంతో తండ్రి తన కూతురిని తెచ్చుకోవాలని అనుకుంటాడని నరసింహా తరుపున లాయర్ వీవీ అంటాడు.
నిర్లక్ష్యం అనే కంటే ముందు వాళ్ళ మధ్యలో ఎంత దూరం ఉందో చెప్తే మంచిది అంటూ దీప తరుపున లాయర్ జ్యోతి అంటుంది. నీ క్లయింట్ వివాహేతర సంబంధం పెట్టుకుంది కాబట్టి తన కూతురు కావాలి అంటున్నాడని VV అంటాడు. ఆ తర్వాత జ్యోతి నరసింహాతో మాట్లాడుతుంది. మీ కూతురిని ఇవ్వమని మీ భార్యని ప్రాధేయపడుతున్నారా అని జ్యోతి అనగానే అవునని నరసింహా అంటాడు. అయితే మీ పెళ్లి రోజు చెప్పండి అని జ్యోతి అనగానే నరసింహా తెలివిగా పెళ్లికి ఇవ్వని వాళ్ళది ఎలా గుర్తు పెట్టుకుంటానని నరసింహ అంటాడు. అయితే మీ కూతురు కావాలి అంటున్నవ్ కదా.. నీ ప్రాణానికి ప్రాణం అయిన నీ కూతురు పుట్టిన రోజు ఎప్పుడు చెప్పండి అంటూ జ్యోతి అనగానే.. నరసింహ తెలియదు అన్నట్టు బిత్తిరి మొహం వేసుకొని చూస్తుంటాడు. ఆ తర్వాత VV కలుగజేసుకొని అనవసరం అయినా ప్రశ్నలు వేసి నా క్లయింట్ ని ఇబ్బంది పెడుతున్నారని అంటాడు. ఆ తర్వాత కాసేపటికి శౌర్య డేటాఫ్ బర్త్ చెప్తాడు. తన కూతురు డేట్ అఫ్ బర్త్ చెప్పడానికి ఇంత టైమ్ తీసుకున్నాడు అంటే ఇక మీరే ఆలోచించండి అని జ్యోతి అంటుంది.
ఆ తర్వాత దీపతో VV మాట్లాడతాడు. తన గురించి అన్నీ ఫాస్ట్ గా చెప్తుంది కానీ నర్సింహా గురించి తడబడుతుంది. భర్త గురించి చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే తనకి ఆల్రెడి ఒక అతనితో సంబంధం పెట్టుకుంది. అతను ఇక్కడే ఉన్నాడు అతనే అంటూ నరసింహా కార్తీక్ ని చూపిస్తాడు. అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ నా కూతురిని స్కూల్ లో జాయిన్ చేసేటప్పుడు తండ్రిగా సంతకం చేసాడు అంతేకాకుండా ఫీజు తనే కట్టాడు అప్పులు కూడా తీర్చాడని నరసింహ అంటాడు. అవి అప్పుగా తీసుకున్నానని దీప అనగానే మరి అందుకు సాక్ష్యం ఉందా అని లాయర్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.